#Reading : పఠనముతోనే యువతలో విజ్ఞత…

Reading : పుస్తకాలకు మహత్తరమైన శక్తి ఉంది ఒక్కసారి ముద్రిస్తే అవి ప్రజల సొమ్ము అవుతాయి. అని లెనిన్ చెప్పినట్లుగా ఎన్నో పుస్తకాలు పాఠకుల కొరకు ఉన్నాయి. రచయితల అభిప్రాయాలే కాదు నిజంగా పుస్తక పఠనo వ్యక్తిని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతుంది.

Reading : పుస్తకాలకు మహత్తరమైన శక్తి ఉంది ఒక్కసారి ముద్రిస్తే అవి ప్రజల సొమ్ము అవుతాయి. అని లెనిన్ చెప్పినట్లుగా ఎన్నో పుస్తకాలు పాఠకుల కొరకు ఉన్నాయి. రచయితల అభిప్రాయాలే కాదు నిజంగా పుస్తక పఠనo వ్యక్తిని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతుంది. సమాజంలో పుస్తకాలు చదివే పాఠకులకు ఆ అదృష్టం లభిస్తుంది. అవే పుస్తకాలు యువత పఠనం చేయడం ప్రారంభిస్తే వారి ఆలోచనలు భావాలు ఊహలు చేతులు మాటలు ఒకటేమిటి అన్ని సమాజాభివృద్ధికి సమాజంలోని చేతనత్వాన్ని కి ఆరోగ్యకరమైన పోటీకి మంచి బాటలు వేస్తాయి.

యువత విద్యావంతులై పుస్తక (Reading) సారాంశం అర్థం చేసుకుని జీవనం కొనసాగిస్తే ఆ ప్రదేశం అభివృద్ధి చెందుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కారణం అంత గొప్ప పుస్తకాలు కలిగిన సమాజం మనది. జాతిపిత మహాత్మా గాంధీ గారి మాటల్లో “ఏ పని ఆలోచించాలి అని గాక ఎలా ఆలోచించాలి” అని నేర్పడమే విద్యా లక్షణం. గడచిన ప్రతిరోజు మనమేదైనా నేర్చుకునేదిగా ఉండాలని రవీంద్రనాథ్ ఠాగూర్ సభ్యసమాజాన్ని తెలియజేశారు. పుస్తకానీకి పఠనానికి అంత గొప్ప శక్తి ఉన్నప్పుడు నేటి యువత పఠన శక్తి గమనిస్తే ఆ శక్తి , శక్తి రెండు తగ్గించుకుంటున్నారని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

పుస్తక పఠనం (Reading) ఆలోచన శక్తిని ఆచరణ సాధ్యాలను పెంచుతుంది. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే తమ చదువు సమయం పరిమితి చేయకుండా ఉత్తమ గ్రంథాలను ప్రముఖ జీవిత చరిత్ర గత కాలం నాటి సామాజిక స్థితిగతులను తెలియజేసే పుస్తకాలను నాటి సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చేసే ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు చేసిన యువ సంస్కర్తల జీవిత విశేషాలు మొదలైనవి చదవటానికి ప్రయత్నించాలి. నేడు కంప్యూటర్ సహాయంతో ఎలాంటి పుస్తక విషయాలనైనా తెలుసుకోవచ్చు.

అంతేగాక నేడు గొప్ప సంస్థలు గా పేరు తెచ్చుకున్న సంస్థల అధినేతల జీవితాలను కూడా పరిశీలించి వారి జీవిత విశేషాలు తెలుసుకోగలిగితే వారి స్థితి వారి పట్టుదల వారి కృషి లక్ష్య సాధన వారి కష్టనష్టాలు వారు ఏర్పరుచుకున్న నియమాలు నిబంధనలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. వారందరూ నేటి యువతకు ఆదర్శప్రాయం ఎందరో యువకులు విద్య నేర్చుకోవడం ఉద్యోగ సాధనకు ప్రభుత్వంపై ప్రభుత్వ ప్రైవేటు చిన్న సంస్థల పై ఆధారపడటం ఎక్కడైనా ఉద్యోగం వస్తుందేమోనని ఆశగా ఎదురు చూడటం కోచింగ్ తీసుకోగలిగిన వారు ఆ ప్రయత్నం చేయడం తరువాత భారం భగవంతునిపై వేయడం. ఇలా కాకపోతే ఇతర చదువులకు విదేశాలకు వెళ్లడం అక్కడ ఉద్యోగాలు సంపాదించడం వారిని చూసి మరికొంతమంది విదేశీ మోజుతో తమ ప్రయత్నాలకు కొంతమంది ఏజెంట్లను నమ్మటం వెళ్లటం లేదా మోసపోవటం. ఇదే ఒక ప్రక్రియగా జరుగుతుంది.

కానీ స్వయం ఉపాధి వైపు తమ స్థాయి ఏదో సమాజానికి తెలియజేసే దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. యువత తమలోని శక్తిని గురించి చి ఉన్నతమైన ఆలోచన చేసి తమ శక్తిని యుక్తిని తాము ఏ రంగంలోనైనా నిరాటకంగా పని చేయగలమనే ధైర్యం తో సామాజిక అవసరాలకు తగిన ఉపాధి అవసరమైతే ప్రభుత్వ సహాయం పోరాడి పొంది ఎంతోమందికి బాసటగా నిలవాలి. ఆ విషయాలకు స్ఫూర్తి పుస్తకపఠనం. ఉపాధ్యాయ అధ్యాపక బృందం విద్యార్థులను పుస్తక పఠనం(Reading) దిశగా మార్చాలి. అప్పుడే యువతకు మనో ధైర్యం పెరిగి ఉత్తేజితులై ఉత్తమ ఆచరణ సాధకులవుతారు. అలా ఉత్తమ ఆచరణ సాధకులు అయినా యువకులే నేటి ఆధునిక సమాజంలో భావి భారత సమాజ నిర్మాతలౌతారు…. ఇంతటి శక్తి ఒక్క పుస్తక పఠనం ద్వారానే మనం సాధించవచ్చు….

No comment allowed please