Emergency Srilanka : అంతా ఊహించినట్టుగానే జరిగింది. గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంతో (Emergency Srilanka)అట్టుడుకుతోంది. పరిస్థితి అదుపు తప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం.
1948 తర్వాత బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన అప్పటి నుంచి అత్యంత బాధాకరమైన తిరోగమనంలో వెళుతోంది. నిత్యావసరాల కొరత, పదునైన ధరల పెరుగుదల , నిరంతర విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది.
దేశ వ్యాప్తంగా ఆకలి కేకలు, ఆర్త నాదాలతో దద్దరిల్లుతోంది. శ్రీలంకలో ప్రజానీకం రోడ్లపైకి వచ్చింది. వీధి నిరసనలు, ప్రదర్శనకారులు దేశ వ్యాప్తంగా ప్రధాన రహదారులను దిగ్భంధించారు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ఆగ్రహంతో వేలాది మంది శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె భవనాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ ఘటనలో పోలీసు బస్సులు, జీపులు, బైకులు 40 కి పైగా దగ్ధమయ్యాయి.
45 మందిని అరెస్ట్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శ్రీలంక చీఫ్ రాజపక్సె భద్రతా దళాలకు విస్తృత అధికారాలు ఇస్తూ అత్యవసర పరిస్థితిని(Emergency Srilanka) ప్రకటించారు.
తన బహిష్కరణకు పిలుపునిచ్చే ప్రదర్శనలు చేయడం, విచారణ లేకుండానే అనుమానితులను దీర్గ కాలం పాటు అరెస్ట్ చేసేందుకు, నిర్బంధించేందుకు మిలటరీకి సర్వాధికారాలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
దేశం ఇబ్బందుల్లో ఉంది అందుకే ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. 22 మిలియన్ల జనాభా ఉన్న శ్రీలంకలో 1948 తర్వాత అత్యంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
నిత్యావసరాల కొరత, ధరా భారం, పెట్రోల్, డీజిల్ పెరుగుదల తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగింది. హక్కుల కార్యకర్తలు, రాజపక్సే దిగి పోవాలంటూ నిరసనలు, ఆందోళను చేపట్టారు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ పై అమెరికా కన్నెర్ర