Revanth Reddy : శుభకృత్ ఉగాది నామ సంవత్సరం సందర్భంగా గాంధీ భవన్ లో పండితుడు శ్రీనివాస మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. వేద పండితులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఆసక్తికరంగా సాగింది. ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డికి(Revanth Reddy) మంచి భవిష్యత్తు ఉందన్నారు. అంతే కాదు ఆయన జోరు పెరుగతుందని, దానికి అడ్డుకట్ట వేసే వారు ఎవరూ ఉండరని జోష్యం చెప్పారు.
కేంద్రంలో ఓ నేత ఆకస్మిక మరణం విస్తు పోయేలా చేస్తుందన్నారు. అటు ఆంధ్ర ప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ప్రజాగ్రహంకు గురవుతాయని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైదని హెచ్చరించారు.
వచ్చే అక్టోబర్ లో టీపీసీసీ చీఫ్ తన పవర్ ఏమిటో చూపిస్తారన్నారు శ్రీనివాస మూర్తి. పార్టీకి, రేవంత్ రెడ్డికి(Revanth Reddy) మంచి భవిష్యత్తు ఉందన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల తరపున తాము కలిసి పని చేస్తామని చెప్పారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని రీతిలో 42 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
80 లక్షల ఓట్లు గనుక తెచ్చుకుంటే 90 సీట్లు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందన్నారు.
ఇదిలా ఉండగా సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : గవర్నర్ ఆహ్వానం హాజరుకాని సీఎం