CM Bommai : సీఎం బొమ్మై సంచ‌ల‌న నిర్ణ‌యం

శివ‌కుమార స్వామి పేరుతో ప‌థ‌కం

CM Bommai  : క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ బొమ్మై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలో త‌న సేవా కార్య‌క్ర‌మాల‌తో పేరొందిన శివ‌కుమారస్వామిని ఎళ్ల‌కాలం గుర్తు పెట్టుకునే విధంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

ఈ మేర‌కు రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం కార్య‌క్ర‌మానికి శివ‌కుమారస్వామి పేరు పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు సీఎం(CM Bommai ).

సిద్ధగంగా మ‌ఠాధిప‌తిగా ఆయ‌న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలకు శ్రీ‌కారం చుట్టార‌ని చెప్పారు.

మ‌ఠం ఆవ‌ర‌ణ‌లో శివ కుమార స్వామీజీ 115వ జ‌యంతిని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన గురువంద‌న కార్య‌క్ర‌మంలో సీఎం బొమ్మై ప్ర‌సంగించారు. శివ‌కుమార స్వామి న‌డిచే దేవుడ‌ని కొనియాడారు.

స్వామీజీ స‌న్నిధిలో ఓ భ‌క్తుడిగా పాల్గొన‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నారు. ఒక ర‌కంగా త‌న జ‌న్మ సార్థ‌క‌మైంద‌న్నారు.

ఎల్ల‌కాలం సూర్య చంద్రులు ఉన్నంత కాలం స్వామీజీ క‌లాక‌లం క‌న్న‌డ వాసుల హృద‌యాల్లో నిలిచే ఉంటార‌ని చెప్పారు.

స్వామీజీ ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు సీఎం. ఒక‌టా రెండా ఏకంగా 88 ఏళ్ల పాటు ప్ర‌తి ఏటా వేలాది మంది విద్యార్థుల‌కు

ఉచితంగా విద్య‌, వ‌స‌తి, భోజ‌నం క‌ల్పించిన మ‌హ‌నీయుడు శివ కుమార స్వామీజీ అని (CM Bommai )కొనియాడారు.

స్వామీజీ వెలిగించిన పొయ్యి నేటికీ వెలుగుతూనే ఉంద‌ని, వేలాది మంది క‌డుపు నింపుతోంద‌న్నారు బొమ్మై. స్వామీజీ ధ‌ర్మ గురువు మాత్ర‌మే కాద‌ని ఆయ‌న జీవితాన్ని త్యాగం చేసిన మ‌హ‌నీయుడ‌ని కొనియాడారు.

ఇదిలా ఉండ‌గా స్వామీజీ చరిత్ర‌ను పాఠ్యాంశంగా తీసుకు రావాల‌ని సూచించారు. సిద్ద‌గంగ మ‌ఠం క‌న్న‌డ నాట ప్రాముఖ్య‌త పొందింది.

Also Read : ఆర్జిత సేవ‌లు పునః ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!