Srilanka Protest : శ్రీలంకలో అప్రకటిత కర్ఫ్యూపై ఆగ్రహం
విద్యార్థుల భారీ నిరసన టియర్ గ్యాస్ ప్రయోగం
Srilanka Protest : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. 2019లో సుస్థిరతకు హామీ ఇస్తూ అధికారంలోకి వచ్చిన రాజపక్సకు రాజకీయ మద్దతులో ఆర్థిక సంక్షోభం తీవ్ర మలుపు తిప్పేలా చేసింది.
దీంతో తనను తాను సేవ్ చేసేందుకు శ్రీలంక సర్కార్ ఏకంగా ఆర్థిక ఎమర్జెన్సీ(Srilanka Protest) ప్రకటించింది. ఆర్మీ, పోలీసు బలగాలకు సర్వాధికారాలు కట్టబెడుతున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఆర్థిక సంక్షోభానికి నిరసనగా ప్రభుత్వం విధించిన వారాంతపు కర్ఫ్యూను క్యాండీలో వేలాది మంది విద్యార్థులు ధిక్కరించారు.
దేశంలో విద్యుత్ కోతతో పాటు ఆహారం, ఇంధనం , ఇతర నిత్యావసరాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ప్రభుత్వ తీరును బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు విద్యార్థులు, ప్రజలు. పెరడేనియా వెలుపట ఆందోళనలు చేపట్టారు.
వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ , వాటర్ ఫిరంగుల్ని ప్రయోగించారు. రాజధాని కొలంబోలో ప్రతిపక్ష నాయకులు చేపట్టిన లాంగ్ మార్చ్ లో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొన్నారు.
ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస ఇంటి వద్ద పెద్ద సమూహం ఏర్పడింది. పోలీసులు, సైనికులు వారిని అడ్డుకున్నారు.
ఇదిలా ఉండగా గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణిచి వేసేందుకు శ్రీలంక సర్కార్ (Srilanka Protestఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ , వాట్సాప్ , యూట్యూబ్ తో సహా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లను పూర్తిగా బ్లాక్ చేసింది.
దేశం ప్రశాంతంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషన్ చైర్మన్ జయంత డిసిల్వ తెలిపారు. మరో వైపు లంక సర్కార్ కు వ్యతిరేకంగా పోస్టులు వెల్లువలా వస్తున్నాయి.
భాష్ప వాయులకు భయపడకండి. అతి త్వరలో తిరిగి నిల్వ చేసేందుకు డాలర్లు అయి పోతారంటూ ఎద్దేవా చేశారు.
Also Read : కుట్ర నిజం చంపడం ఖాయం