Sharad Pawar : సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా, ట్రబుల్ షూటర్ గా పేరొందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఏ చైర్మన్ పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
గత కొంత కాలంగా తనపై వస్తున్న ప్రచారాన్ని ఆయన తోసి పుచ్చారు. ఏ పోస్ట్ పై ఆసక్తి లేదని మరోసారి కుండ బద్దలు కొట్టారు. అయితే డ్రైవింగ్ ఫోర్స్ గా ఉంటానని పేర్కొన్నారు నర్మగర్భంగా.
ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కమిటీకి తాను ప్రాతినిధ్యం వహించాలని అనుకోవడం లేదన్నారు. మహారాష్ట్రలోని కొల్హా పూర్ లో శరద్ పవార్ (Sharad Pawar)మీడియాతో మాట్లాడారు.
అయితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదుగుతుందని తాను అనుకోవడం లేదన్నారు. తాను అన్నట్లు వస్తున్న ఈ వ్యాఖ్యలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు యూపీఏ చైర్ పర్సన్ తో సహా మరే ఇతర పోస్ట్ పై ఆసక్తి లేదని తెలిపారు పవార్.
తాను ఏ పదవుల కోసం ఎప్పుడూ పాకు లాడలేదని, దాని కోసం తాను ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. తననే పదవులు వరించాయని అన్నారు. తన పరిమితులు ఏమిటో తనకు తెలుసన్నారు.
తాను ఏ బాధ్యతలు తలకెత్తుకోనని పవార్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పవర్ లోకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉందన్నారు. ఆక్టోపస్ లా బీజేపీ అల్లుకు పోయిందన్నారు. దానిని ఎదుర్కోవాలంటే బలమైన శక్తి కావాలని పవార్ సూచించారు.
Also Read : బీజేపీపై సీఎం స్టాలిన్ సెటైర్