Elon Musk Twitter : కాలం మారింది బాస్. ఎవరి సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఏ కంపెనీ ఎప్పుడు కోట్లను కొల్లగొడుతుందో ఊహించలేం. పిట్ట కొంచెం కూత ఘనం అన్న రీతిలో దూసుకు పోతోంది మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్.
తాజాగా సదరు సంస్థకు భారీ జాక్ పాట్ తగిలింది. అదేమిటంటే ఇప్పటికే ప్రపంచాన్ని తన కనుసైగల్లో శాసిస్తున్న ట్విట్టర్ కు సిఇఓ మనోడే. ఇక ప్రపంచ కుబేరుల్లో టాప్ లో ఉన్న టెస్లా కంపెనీ ఫౌండర్ కమ్ చైర్మన్ ఎలన్ మస్క్ (Elon Musk Twitter)కన్ను ఈ పిట్టకూతపై పడింది.
ప్రస్తుతం భూమిని దాటిన ఆయన ఆలోచనలు ఇప్పుడు ఆకాశంపై కూడా వాలి పోతున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియాపై మనోడి కన్ను పడింది. ఏకంగా జనాన్ని మెస్మరైజ్ చేస్తున్న ట్విట్టర్ లో ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు.
ఈ మేరకు తను షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఒకే ఒక్క సమాచారంతో ట్విట్టర్ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. ఇందులో భాగంగా ట్విట్టర్ లో 9.2 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు టాక్.
ఇదిలా ఉండగా ఇవాళ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్ లో ఈ విషయం బట్ట బయలు అయ్యింది. ఈ ఏడాది ఫిభ్రవరి 10న మనోడు షేర్లు కొనుగోలు చేసినట్లు అందులో పేర్కొనడం కలకలం రేగింది.
ఏది ఏమైనా డబ్బు డబ్బును సృష్టిస్తుందన్న నానుడి మస్క్(Elon Musk Twitter) ను చూస్తే తెలుస్తుంది కదూ.
Also Read : పెట్రోల్..డీజిల్ మంట తప్పని తంట