TS Governor : తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ గా మారి పోయింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఈ తరుణంలో సీఎం మోదీపై యుద్దం ప్రకటించారు. సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ నుంచి ఫోన్ రావడంతో హుటా హుటిన గవర్నర్ తమిళి సై(TS Governor )ఢిల్లీకి బయలు దేరారు.
మంగళవారం ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షాతో గవర్నర్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల గురించి ఆమె వివరించనున్నట్లు సమాచారం.
ఆమె ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ప్రస్తుతం తమిళి సై పర్యటన కీలకం కానుంది. ఆమె మొదట్లో వచ్చాక సీఎం కేసీఆర్ , గవర్నర్ తమిళి సై మధ్య సఖ్యతగానే ఉండింది.
ఆ తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ప్రతిపాదించడం గవర్నర్ సదరు ఫైల్ ను తిరిగి పంపించడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, ప్రోటోకాల్ వివాదాల గురించి తప్పకుండా తమిళి సై సౌందర్య రాజన్(TS Governor )హోం శాఖ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.
ఇదే సమయంలో ఇప్పటికే అమిత్ షా తెలంగాణపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. దీంతో మేడం ఇచ్చే రిపోర్ట్ కీలకంగా మారనుంది.
యాదగిరిగుట్టకు వెళ్లిన గవర్నర్ ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వెళ్లారు. ఈవో కూడా హాజరు కాలేదు. అందరి ఫోకస్ మేడం టూర్ పైనే ఉంది.
Also Read : ఆ పబ్కి అన్ని అనుమతులూ ఉన్నాయి – ఎక్సైజ్ శాఖ