Ravnveet Singh Bittu : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగులుతోంది. ఇప్పటికే జీ23 పేరుతో అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు నాయకులు. ఈ తరుణంలో వచ్చే 2024 ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నా ఆ పార్టీకి అంతర్గత పోరు ఎక్కువవుతోంది.
ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రధానంగా అధికారంలో ఉన్న పంజాబ్ ను వదులుకుంది.
దీని వెనుక అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయనేది వాస్తవం. దీంతో పీసీసీ చీఫ్ కు నవ జ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. దళిత కార్డుతో సీఎం చన్నీని చేసినా గట్టెక్క లేక పోయింది కాంగ్రెస్ పార్టీ.
ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ 117 సీట్లకు గాను 92 సీట్లు చేజిక్కించుకుని సత్తా చాటింది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీగా ఉన్న రన్ వీత్ సింగ్ బిట్టూ (Ravnveet Singh Bittu ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఆయన కలుస్తున్న విషయం పార్టీకి తెలియదు. దీంతో బిట్టూ సమావేశం కావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇదిలా ఉండగా పంజాబ్ లో నెలకొన్న సమస్యల గురించి మాత్రమే మోదీతో చర్చించారని బిట్లూ(Ravnveet Singh Bittu )సన్నిహితులు చెప్పారు.
ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరబోరంటూ స్పష్టం చేశారు. పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనుమడే ఈ బిట్టూ. దీనిపై రాద్ధాంతం చేయొద్దని బిట్టూ కోరారు. పీఎంతో సమావేశం అయ్యా. పంజాబ్ అంశాలను చర్చించానని తెలిపారు.
Also Read : మేల్కోక పోతే భారత్ లో శ్రీలంక పరిస్థితే