Sri Lanka Crisis : రాజపక్సపై పెల్లుబికిన ప్రజాగ్రహం
ప్రెసిడెంట్ ఆఫర్ ప్రతిపక్షాలు తిరస్కరణ
Sri Lanka Crisis : శ్రీలంకలో సేమ్ సీన్ కొనసాగుతోంది. ఆకలి కేకలు, ఆర్త నాదాలు కంటిన్యూ అవుతున్నాయి. జనం రోడ్లపైకి వచ్చారు. వెంటనే దేశ అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ తాను తప్పుకునే ప్రసక్తి లేదంటున్నారు ప్రెసిడెంట్. ప్రభుత్వంలో చేరాలంటూ ఇచ్చిన ఆఫర్ ను ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ఓ వైపు దేశం తల్లడిల్లి పోతుంటే తామెందుకు చేరుతామంటూ నిలదీశారు.
వారు సైతం రోడ్డెక్కారు. ప్రస్తుతం ఆందోళనలు మిన్నంటాయి దేశ రాజధాని కొలంబోలో. పెద్ద ఎత్తున నిరసనలు(Sri Lanka Crisis )కొనసాగుతున్నాయి. దేశంలో ఆహారం, ఇంధనం, ఔషధాల కొరత తీవ్రంగా ఉందని అందుకు బాధ్యత వహిస్తూ తప్పు కోవాలని డిమాండ్ చేశారు.
అత్యవసర పరిస్థితిని ఎత్తి వేయాలని సమస్యలకు కారణమైన ప్రభుత్వం వెంటనే రిజైన్ చేయాలని కోరుతున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు.
వారిని విడుదల చేసేంత దాకా తమ పోరు సాగుతుందని స్పష్టం చేశారు. ఇవాళ లంక పార్లమెంట్ మొదటి సెషన్ స్టార్ట్ కానుంది. పూర్తి స్థాయిలో కేబినెట్ నియమించేంత వరకు శ్రీలంక చీఫ్ రాజపక్స (Sri Lanka Crisis )నలుగురు మంత్రులను నియమించారు.
మంగళవారం అత్యవసర ఆరోగ్య పరిస్థితిని విధించారు. మరో వైపు దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ కాబ్రాల్ తప్పుకున్నారు.
అంతకు ముందు తన సోదరుడు, దేశ ప్రధానిగా ఉన్న మహీంద రాజపక్సతో పాటు మొత్తం 26 మంది మంత్రులు తమ పదవులుకు రాజీనామా చేశారు.
నిరసనలు తీవ్రతరం కావడంతో దేశంలో పూర్తిగా సోషల్ మీడియాను, ప్రచురణ, ప్రసార మాధ్యమాలపై నిషేధం విధించారు దేశ అధ్యక్షుడు రాజపక్స.
Also Read : ప్రభుత్వంలో చేరాలని ప్రతిపక్షాలకు ఆఫర్