Imran Khan : పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , తాత్కాలిక ప్రధాన మంత్రి గా ఉన్న ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తనను టార్గెట్ చేసిన ప్రతిపక్షాలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బంతి సుప్రీంకోర్టుకు చేరింది.
ఇదిలా ఉండగా ఖాన్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ డిప్యూటీ స్పీకర్ కొట్టి వేశారు. దీనిని సవాల్ చేస్తూ విపక్షాలు కోర్టును ఆశ్రయించాయి.
ఈ తరుణంలో తాము తిరిగి ఎన్నికలకు వెళతానని ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan). ఇవాళ తన పార్టీకి చెందిన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ తరుణంలో ఎన్నికలకు ఎలా వెళతారంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రశ్నించింది. మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని స్పష్టం చేసింది.
ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని పీఎం ఆరిఫ్ అల్వీని ఆదేశించారు.
ఇదిలా ఉండగా చట్ట పరమైన, రాజ్యాంగ పరమైన, లాజిస్టికల్ సవాళ్ల కారణంగా మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించ లేమంటూ పేర్కొంది ఎన్నికల సంఘం.
డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేస్తూ కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణకు రానుంది. ఈ తరుణంలో ఎన్నికల సంఘం ఇలా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నియోజకవర్గాల తాజా డీలిమిటేషన్ కారణంగా సీట్ల సంఖ్య పెరిగిందని, ఓటర్ల జాబితా ఉండాల్సిన అవసరం ఉందని అందుకే 3 నెలల్లో కష్టమని ఈసీ స్పష్టం చేసింది.
Also Read : కోర్టుకు చేరిన పాక్ పంచాయతీ