Youtube Channels Block : భారత దేశంలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోస్తూ , శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పలు చానళ్ల నిర్వాకంపై , వాటి పోకడపై కేంద్ర సర్కార్ నిఘాను ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా ప్రత్యేకించి భారత్ పై విషం కక్కుతున్న 22 యూట్యూబ్ చానళ్లపై నిషేధం విధించింది. వాటిని బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. ఇక బ్లాక్ చేసిన ఈ యూట్యూబ్ చానళ్లలో 18 చానళ్లు భారత దేశానికి చెందినవి ఉన్నాయి.
ఇక మరో 4 యూట్యూబ్ చానళ్లు పాకిస్తాన్ కు చెందినవని తెలిపింది. కాగా ఐటీ రూల్స్ 2021 ప్రకారం యూట్యూబ్ చానళ్లను నిషేధించినట్లు(Youtube Channels) ప్రకటించింది.
ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. యూట్యూబ్ వీక్షకులను తప్పుదోవ పట్టించేందుకు గాను ప్రాముఖ్యం పొందిన కొన్ని టీవీ చానళ్ల లోగోలను కూడా ఈ 22 యూట్యూబ్ ఛానళ్లు అనధికారికంగా ఉపయోగించు కున్నాయని స్పష్టం చేసింది కేంద్ర మంత్రిత్వ శాఖ.
తప్పుడు థంబ్ నెయిల్స్ తో వీక్షకులను గందర గోళానికి గురి చేస్తూ వ్యతిరేక ప్రచారానికి ఆజ్యం పోస్తున్నాయంటూ తెలిపింది. ఇక యూట్యూబ్ ఛానళ్లతో పాటు 3 ట్విట్టర్ అకౌంట్లు, ఒక ఫేస్ బుక్ అకౌంట్ , ఒక న్యూస్ వెబ్ సైట్ ను కూడా నిలిపి వేసినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇక నుంచి ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వార్తలు ప్రసారం చేసినా చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది.
Also Read : ప్రపంచ కుబేరుల్లో మనోడు పదోడు