Americai Narayanan : కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసమ్మతి స్వరం ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. తాజాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న అమెరికై. నారాయణన్.
ఆయన సంచలన కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ పార్టీ పరంగా ముందంజలో ఉండాలని కానీ ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంక తప్పు కోవాలని డిమాండ్ చేశారు.
దీంతో వి. నారాయణన్ పార్టీ నుంచి ఉద్వాసన పలికారు. ఈ మేరకు ఆయనపై వేటు వేశారు. రాహుల్ , ప్రియాంక, సోనియా గాంధీ ఎన్నికల తర్వాత రాజీనామా చేయాలని ప్రతిపాదించారు.
అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో ఎక్కువ మంది సభ్యులు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ ను కాపాడేందుకు రాహుల్, ప్రియాంక గాంధీలను పక్కన పెట్టాలని సూచించారు నారయణన్(Americai Narayanan).
ఇక మమతా బెనర్జీ, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ వంటి పార్టీ పూర్వీకులు తిరిగి వచ్చి కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్దరించాలని ఏఐసీసీ సభ్యుడు కామెంట్స్ చేయడం ఇప్పుడు కలకలం రేపింది.
భారత ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేందుకు పార్టీని వీడిన వారిని , మాజీ నాయకులను తీసుకు రావాలన్నారు. పవర్ లోకి వస్తే పరపతి పెరుగుతుంది. డబ్బులు వస్తాయన్నారు. మమతా బెనర్జీ వస్తే ఆమె ఇతరులను కూడా ఒప్పించ గలదన్నారు.
నారాయణన్ గాంధీల నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లిన దక్షిణాది నుంచి అరుదైన పార్టీ నాయకుడు. సంస్థాగత పునరుద్దరణ, పూర్తి సమయం కోసం , నాయకత్వం కోసం జరిగిన అసమ్మతి నేతల్లో ఒకరు కాదు. కానీ ఆయన నిఖార్సైన కాంగ్రెస్ వాది ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
Also Read : కేంద్రంపై మిత్ర పక్షం ఆగ్రహం