Zelensky : ఐక్య‌రాజ్య స‌మితిపై జెలెన్ స్కీ ఫైర్

వీటో ప‌వ‌ర్ తో ర‌ష్యా ఆధిప‌త్యం

Zelensky : ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఐక్య‌రాజ్య స‌మితి సెక్యూరిటీ కౌన్సిల్ ను ఉద్దేశించి ప్ర‌సంగించాడు. సైనిక చ‌ర్య పేరుతో యుద్దానికి దిగ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించాడు.

ర‌ష్యా యుద్ద నేరానికి పాల్ప‌డింద‌ని , త‌క్ష‌ణ‌మే భ‌ద్రతా మండ‌లి స్పందించాల‌ని కోరాడు. వీడియో కాన్ఫ‌రెన్స్ లో కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించాడు జెలెన్ స్కీ(Zelensky ).

ఎక్క‌డ ప‌డితే అక్క‌డ శ‌వాలు క‌నిపిస్తున్నాయ‌ని ఈ నేర‌మంతా ర‌ష్యాది దానిని పాలిస్తున్న ప్రెసిడెంట్ పుతిన్ దేన‌ని ఆరోపించాడు. ఐరాస ఉండీ ఏం లాభమ‌ని ప్ర‌శ్నించాడు.

పూర్తిగా ర‌ద్దు చేసుకుంటే బెట‌ర్ అని స‌ల‌హా ఇచ్చాడు. ఇంత మార‌ణ హోమం, న‌ర‌మేధం కొన‌సాగుతున్నా ఈరోజు వ‌ర‌కు ఐక్య రాజ్య స‌మితి ఏం చేస్తోందంటూ నిల‌దీశాడు జెలెన్ స్కీ.

దాడుల‌కు పాల్ప‌డుతూ మాన‌వ‌త్వాన్ని మంట గ‌లుపుతున్న ర‌ష్యాను ఈ ప్ర‌పంచం నుంచి ఐరాస నుంచి వెలి వేయాల‌ని పిలుపునిచ్చాడు.

లేక పోతే మీరైనా దిగి పోవాల‌ని కోరాడు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ లేన‌ప్పుడు ఉండ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటి అని ప్ర‌శ్నించాడు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశాడు.

వీటో అధికారాన్ని త‌మ‌ను చంపేందుకు హ‌క్కుగా, ఓ లైసెన్స్ గా వాడుకుంటోందంటూ ఆరోపించాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే ర‌ష్యా అనుస‌రిస్తున్న విధానం ప్ర‌పంచ భ‌ద్ర‌త‌కు పెను ముప్పు అని హెచ్చ‌రించాడు జెలెన్ స్కీ.

ఇదిలా ఉండ‌గా యావ‌త్ ప్ర‌పంచం ర‌ష్యా దాడుల‌ను ఖండిస్తోంది. కానీ పుతిన్ త‌గ్గ‌డం లేదు.

Also Read : కుట్ర నిజం దౌత్య‌వేత్త‌పై ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!