Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. వారసత్వ రాజకీయాలు దేశానికి, ప్రత్యేకించి ప్రజాస్వామానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
ఇవాళ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా ఆయన జాతిని, పార్టిని ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ముఖ్యమైన ఘట్టమని అభివర్ణించారు.
భారత దేశం కోసం కొత్త అవకాశాలు నిరంతరం ఉద్భవిస్తున్నాయని తెలిపారు ప్రధాన మంత్రి. దేశంలోని బీజేపీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు మోదీ(Modi ).
ఇదే రకమైన జోష్ రాబోయే 2024 దాకా ఉండాలని కోరారు. రాజవంశ కుటుంబాలు డెమోక్రసీకి విఘాతంగా మారడం బాధాకరమన్నారు. దీనిని తప్పనిసరిగా వ్యతిరేకించాలని సూచించారు.
అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో 100 సీట్లు భారతీయ జనతా పార్టీకి దక్కడం మామూలు విషయం కాదన్నారు మోదీ(Modi ). ఇటీవల దేశంలోని నాలుగు రాష్ట్రాలలో బీజేపీ మరోసారి విజయ ఢంకా మోగించిందన్నారు.
దీని వల్ల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని మరోసారి అర్థమై పోయిందన్నారు. విపక్షాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. తాము ఏది చెపుతున్నామో వాటినే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
యావత్ ప్రపంచానికి భారత్ లో ఉన్న పవర్ ఏమిటో చూపించామన్నారు. కరోనాను సక్సెస్ ఫుల్ గా ఎదుర్కొన్నామని చెప్పారు మోదీ.
కొన్ని వారాల కిందట బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ నాలుగు రాష్ట్రాలలో తిరిగి వచ్చిందన్నారు. ఆయన కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం కలకలం రేపింది.
Also Read : గాంధీ ఫ్యామిలీపై కామెంట్