Mahua Moitra : హిందువుల పండుగ నవరాత్రిని పురస్కరించుకొని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మాంసం దుకాణాలపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహూవా మొయిత్రా(Mahua Moitra).
భారత రాజ్యాంగం ద్వారా భారత పౌరులకు హామీ ఇచ్చిన స్వేచ్ఛ గురించి ప్రస్తావించారు. తమకు నచ్చిన సమయంలో మాంసం తినవచ్చు. మాంసం విక్రయించేందుకు దుకాణాదారులకు హక్కు ఉందని గుర్తు చేశారు ఎంపీ.
నేను దక్షిణ ఢిల్లీలో ఉన్నాను. ఒక రకంగా ఇలా నిషేధం విధించడం వల్ల చాలా మందికి ఉపాధి ఉండదన్నారు. ఆమె ఇలాంటి వాంటికి వెంటనే పుల్ స్టాప్ పెట్టాలంటూ కోరారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇదిలా ఉండగా దక్షిణ ఢిల్లీ మేయర్ ముఖేష్ సూర్యన్ దుర్గా దేవికి అంకితమైన నవరాత్రుల పవిత్రమైన కాలంలో తన పౌర సంస్థ కింద మాంసం దుకాణాలను మూసి వేయాలని ప్రకటించారు.
ఈ తొమ్మిది నవరాత్రుల రోజులలో భక్తులు మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి తిన కూడదంటూ తెలిపారు. పెద్ద ఎత్తున తమకు ఫిర్యాదులు వచ్చాయని , అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఇందులో ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదన్నారు. ఇది ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించదని పేర్కొన్నారు. కొన్ని ఇస్లామిక్ దేశాలలో బహిరంగంగా నీళ్లు తాగడంపై నిషేధం విధించడాన్ని ఆయన సమర్థించారు.
ఢిల్లీ వాసుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు మేయర్. కాగా నార్త్ కార్పొరేషన్ నుంచి ఇలాటి నిర్ణయం వెలువడక పోవడం విడ్డూరంగా ఉంది.
Also Read : హర్యానా సీఎం సంచలన నిర్ణయం