Shashi Tharoor : ఇవాళ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తన 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన పార్టీని ఉద్దేశించి ప్రసంగించారు.
పనిలో పనిగా వారసత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఆయన సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలను పరోక్షంగా ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతీయ జనతా పార్టీ అంటేనే ఏది చెపుతుందో దానికి విరుద్దంగా చేస్తుందంటూ ఎద్దేవా చేశారు.
దానికి మతం తప్ప మరో మార్గం లేదన్నారు. ఇందుకు సంబంధించి బీజేపీ రాజ్యాంగంలోని మొదటి పేజీ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు శశి థరూర్. ఆ పార్టీకి , మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ దేనినీ అనుసరించక పోవడం జుమ్లాలో ఒకటి కాదా అని ప్రశ్నించారు. మీరు ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తారు. ఆపై మరిచి పోతారు. కొందరి ప్రయోజనాలను కాపాడేందుకు మాత్రమే మీరు పని చేస్తున్నారంటూ ఆరోపించారు శశిథరూర్(Shashi Tharoor).
హ్యాపీ బర్త్ డే బీజేపీ. మీకు ఈ రోజు 42 ఏళ్లు . మీ స్వంత రాజ్యాంగానికి అనుగుణంగా జీవించడం ప్రారంభించేందుకు ఇది సమయం కాదా అని నిలదీశారు.
పోనీ మీరు నిజంగా విశ్వసించే లేదా ఆచరించే దాని మొదటి పేజీలో ఏదీ కనిపించడం లేదంటూ పేర్కొన్నారు. ఈ పత్రం ఏదైనా మీ జేబులో ఉందా అని శశి థరూర్ ట్వీట్ చేశారు.
Also Read : హర్యానా సీఎం సంచలన నిర్ణయం