Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభం మరింత ముదిరింది. ఆకలి కేకలు, ఆర్త నాదాలు, దాడులు, కాల్పులు, అరెస్ట్ ల పర్వం కొనసాగుతూనే ఉన్నది. అనాలోచిత నిర్ణయాలు, ముందు చూపు లేనితనం ఇప్పుడు ఆ ద్వీప దేశాన్ని నానా తిప్పలు పెడుతోంది.
రాజపక్స కుటుంబం కీలక పదవుల్లో ఉండడం కూడా మరో కారణం. ఇప్పటి వరకు దక్షిణాన బీచ్ సైడ్ పట్టణాల నుంచి తమిళం మాట్లాడే ఉత్తరం దాకా 100కి పైగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నానా తంటాలు పడుతోంది. 2020లో మహింద రాజపక్సే(Sri Lanka Crisis) తన సోదరుడు , అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆధ్వర్యంలో పని చేస్తూ శ్రీలంక ప్రధాన మంత్రి కావడానికి ఎన్నికల్లో విజయం సాధించారు.
2021లో మరో తోబుట్టువు బాసిల్ ఆర్థిక మంత్రిగా నియమితుడయ్యాడు. అధికారంలో కుటుంబం పట్టును మరింత కఠినతరం చేసింది. ఒక ఏడాది లోపే దేశంలోని ప్రముఖ రాజకీయ రాజవంశం ఇబ్బందుల్లో పడింది.
ఎందుకంటే ఆర్థిక సంక్షోభం రాక ముందే ఊహించ లేనటువంటి డిమాండ్లు చేస్తూ నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ఇక మిగిలింది అధ్యక్షుడు పదవీ విరమణ చేయడం మాత్రమే మిగిలి ఉంది.
కొలంబోలోని ఆకులతో కూడిన బౌలేవార్డ్ లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. హారన్లు మోగిస్తూ ఆందోళన బాట పట్టారు.
ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, విద్యుత్ కోతలు , సంక్షోభాన్ని దిగజార్చిన పాలకుల దుర్వినియోగం వంటి వాటిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజపక్స (Sri Lanka Crisis)రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : సైనికులు పోలీసుల మధ్య ఘర్షణ