AP Cabinet : 11న ముహూర్తం ఖ‌రారు

గ‌వ‌ర్న‌ర్ కు సీఎం వెల్ల‌డి

AP Cabinet : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నూత‌న మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. ఈనెల 11న మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ(AP Cabinet) ఏర్పాట్లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ విశ్వ భూష‌ణ్ కు విష‌యం వెల్ల‌డించారు సీఎం. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే ముందే కొత్త కేబినెట్(AP Cabinet) గురించి, ఎవ‌రిని తీసుకుంటామ‌నే దానిపై వివ‌రాలు తెలిపారు.

అదే రోజున మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. కొత్త కేబినెట్ కొలువు తీరాలంటే రాజ్యాంగ బ‌ద్దంగా ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ముద్ర త‌ప్ప‌నిస‌రి. గ‌వ‌ర్న‌ర్, సీఎం మ‌ధ్య 45 నిమిషాల‌కు పైగా చ‌ర్చ జ‌రిగింది. ఎవ‌రు కొలువు తీరుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. కొత్త ఎమ్మెల్యేల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌నున్నారు జ‌గ‌న్.

ఇదిలా ఉండ‌గా గ‌త వారం రోజుల నుంచి గ‌వ‌ర్న‌ర్ విశ్వ భూష‌ణ్ ఒరిస్సా, ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఏపీకి విచ్చేశారు. ఈ త‌రుణంలో మ‌ర్యాద పూర్వ‌కంగా గ‌వ‌ర్న‌ర్ ను ఏపీ సీఎం జగ‌న్ రెడ్డి క‌లుసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా బుధ‌వారం సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని క‌లిశారు. అనంత‌రం కేంద్ర ఉప‌రిత‌ల రవాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో భేటీ అయ్యారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు ఇదిలా ఉండ‌గా ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోర‌నున్నారు.

Also Read : సిక్కోలు సింహాని’కి మోదీ ప్ర‌శంస‌

Leave A Reply

Your Email Id will not be published!