MK Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఆస్తి పన్ను సవరిస్తామని వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష పార్టీలు ఏఐడీఎంకే, బీజేపీతో పాటు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు రాజకీయం చేయొద్దని కోరారు. స్థానిక సంస్థలకు ప్రజానుకూలమైన కార్యక్రమాలను చేపట్టేందుకు ఆస్తి పన్ను సవరిస్తున్నామని తెలిపారు.
ఇప్పుడున్న తరుణంలో ఆస్తి పన్ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు కొత్తగా ఎన్నికైన పౌర సంస్థలకు నిధులు వచ్చేలా చేసందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు ఎంకే స్టాలిన్(MK Stalin).
ఇవాళ ఆయన ఆస్తి పన్నులో చేపట్టబోయే మార్పుల గురించి వెల్లడించారు. ఇటీవల ప్రకటించిన సవరణను ఉపసంహరించు కోవాలని లేదా తగ్గింపును ప్రకటించాలని అసెంబ్లీలో తన మిత్రపక్షాలతో సహా వివిధ రాజకీయ పార్టీలు చేసిన విన్నపాలను ఆయన తిరస్కరించారు.
ఆస్తి పన్ను సవరణను ఉద్దేశ పూర్వకంగా జరగలేదన్నారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి చేయాల్సి ఉందన్నారు సీఎం(MK Stalin). ఆస్తి పన్నును సవరించడంలో ప్రభుత్వం ఆనందంగా లేదు.
కానీ నగదు కొరత ఉన్న స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకే అలా చేయాల్సి వచ్చిందన్నారు ఎంకే స్టాలిన్. పెంచడానికి గల కారణాలను వివరించారు సీఎం.
స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల నిధుల కొరత ఏర్పడిందన్నారు. నగదు కొరతతో అలమటిస్తున్న పౌర సరఫరాల సంస్థలకు ప్రజల కనీస అవసరాలు తీర్చే వనరులు లేవన్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరగడంతో ఆ పరిస్థితి లేకుండా పోయందన్నారు.
Also Read : పరువునష్టం కేసులో నటి రోజా భర్తపై అరెస్ట్ వారెంట్