YS Jagan : వ‌లంటీర్లకు వంద‌నం సేవ‌ల‌కు స‌లాం

మీ ప‌నితీరు అపురూపమ‌న్న సీఎం జ‌గ‌న్

YS Jagan  : ఏపీలోని వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ దేశానికి రోల్ మోడ‌ల్ గా మారింద‌న్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan ). పాల‌నా ప‌రంగా వీరంతా స్వ‌చ్చంధంగా త‌మ విధులు నిర్వ‌హిస్తున్నార‌ని, వారి సేవ‌ల‌కు వెల‌క‌ట్ట లేమ‌న్నారు.

ప‌ల్నాడు జిల్లా న‌ర‌సారావుపేట‌లో వ‌లంటీర్ల‌కు వంద‌నం పేరుతో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌కు తాను స‌లాం చేస్తున్నాన‌ని చెప్పారు.

తాను క‌ల‌లు క‌న్న ప్ర‌తి ప‌థ‌కాన్ని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకు వెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని కితాబు ఇచ్చారు సీఎం. వివ‌క్ష‌, లంచం, అవినీతికి తావు లేకుండా ప‌ని చేయ‌డాన్ని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

వ‌లంటీర్ల వ్య‌వ‌స్థను చూసి మిగ‌తా రాష్ట్రాలు సైతం ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు య‌త్నిస్తున్నాయంటూ పేర్కొన్నారు జ‌గ‌న్ రెడ్డి. సేవే ప‌రామ‌ర్థంగా ప‌ని చేస్తున్నార‌ని వారి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నారు ఏపీ సీఎం.

రాష్ట్రంలో ఈ వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌జ‌ల‌కు 33 ర‌కాల సేవ‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో ఏకంగా 2 ల‌క్ష‌ల 60 వేల మంది వ‌లంటీర్లు విధులు నిర్వ‌హిస్తున్నార‌ని ఇదంతా సేవా భావంతో ప‌ని చేస్తున్నారంటూ చెప్పారు సీఎం(YS Jagan ).

ల‌క్ష‌లాది మంది పేద‌ల‌కు మేలు జ‌రుగుతోంద‌న్నారు. ఒక ర‌కంగా ప్ర‌జా సేవ‌కులే కాదు గొప్ప మ‌న‌సున్న సైనికులంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

నిస్వార్థంతో, సేవా భావంతో స‌ర్వీసు అందిస్తున్న వారికి చిరు స‌త్కారం చేస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చెప్పారు. ఇలాగే సేవ‌లు అందిస్తూ ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌ని కోరారు.

Also Read : విజ‌య సాయి నిర్వాకం ఏబీ ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!