Modi : దేశంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi). తాము తీసుకు వచ్చిన ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద పథకం అని పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ అరుదైన పథకం వల్ల కోట్లాది మందికి మేలు జరుగుతోందన్నారు.
దేశంలోని ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఇదే సమయంలో ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న నర్సులు, డాక్టర్లు, కింది స్థాయి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు మోదీ(Modi).
కరోనా కష్ట కాలంలో సైతం మీరందించిన సేవలు ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది ఈ దేశమని పేర్కొన్నారు పీఎం. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు.
దేశంలోని నలు మూలలా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో చివరి దాకా వైద్యం అందుబాటులో ఉండేలా చేయడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. దునియా లోనే ఈ స్కీం అతి పెద్దదన్నారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని దీని వల్ల వాళ్లు ఇబ్బందులకు దూరమవుతున్నారని తెలిపారు మోదీ.
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందులో భాగంగా ఆయుష్మాన్ నెట్ వర్క్ ను అమలు చేస్తామని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.
గత ఎనిమిది సంవత్సరాల కాలంలో వైద్య రంగం దేశంలో మరింత అభివృద్ధి చెందిందని తెలిపారు.
Also Read : కేంద్ర విద్యా విధానంపై స్టాలిన్ కన్నెర్ర