Modi : ఉద్యోగాల క‌ల్ప‌నపై ఫోక‌స్ పెట్టాలి

పిలుపునిచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

Modi  : కేంద్ర స‌ర్కార్ ఇప్పుడు ఉద్యోగాల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టింది. పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌తిప‌క్షాలు మోదీని (Modi )నిల‌దీశాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా బీజేపీ హ‌యాంలో దాదాపు ల‌క్ష‌లాది జాబ్స్ ఖాళీగా ఉన్నాయి.

ప్ర‌భుత్వం పూర్తిగా ప్రైవేట్ మంత్రం జ‌పిస్తోంది. ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు అప్ప‌గిస్తోంది. ఈ త‌రుణంలో తాజాగా ప్ర‌ధాన‌మంత్రి అధ్య‌క్ష‌త‌న అన్ని శాఖ‌ల‌కు చెందిన కార్య‌ద‌ర్శులతో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల ఓటు బ్యాంకు కూడా ఎక్కువ‌గా ఉంది.

ఈ త‌రుణంలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ప‌వ‌ర్ లోకి రావాలంటే అన్ని వ‌ర్గాల వారిని సంతృప్తి ప‌ర్చాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందులో భాగంగా ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు సృష్టించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని మోదీ(Modi )ఆదేశించారు.

ప్రైవేట్ రంగానికి చేయూత ఇవ్వాల‌ని ప్ర‌ధాని సూచించారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగాల‌లో ఉపాధి క‌ల్ప‌నే ధ్యేయం కావాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగానే త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు ప్రారంభించాలంటూ గౌబా కార్య‌ద‌ర్శుల‌కు లేఖ‌లు రాశారు.

ఆర్థిక అభివృద్ధికి ప్ర‌భుత్వం ఫెసిలిటేట‌ర్ గా , ఉత్ప్రేర‌క ఏజెంట్ గా ఉండాల‌న్నారు. త‌యారీ, ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్రోత్సాహాన్ని అందించేందుకు భార‌తీయ కంపెనీలు ప్ర‌పంచ కంపెనీల‌తో పోటీ ప‌డాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఆయా శాఖ‌ల‌లో మంజూరైన పోస్టులు ఎన్ని ఉన్నాయి. ఇంకా భ‌ర్తీ చేయాల్సిన పోస్టుల వివ‌రాలు వెంట‌నే న‌మోదు చేయాల‌ని ఆదేశించారు.

Also Read : ఆప్ కు ఆద‌ర‌ణ బీజేపీ ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!