TPCC Dharna : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైరతాబాద్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు పార్టీ శ్రేణులు, నాయకులు.
అంతకు ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని(TPCC Dharna) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడిచి పెట్టారు. భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
రేవంత్ రెడ్డి విద్యుత్ భవన్ కు చేరుకునే ప్రయత్నం చేశారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. అనంతరం రేవంత్ రెడ్డి(TPCC Dharna) ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు తెలంగాణ విద్యుత్ సంస్థ సీఎండీ ప్రభాకర్ రావును కలిశారు.
ఈ సందర్భంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సామాన్యులపై పెను భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే కరోనా కారణంగా ఉపాధి లేకుండా పోయిందని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్క పడుతున్న తరుణంలో విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తే ఎలా అని ప్రశ్నించారు.
ఓ వైపు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుంటే ఇంకో వైపు రాష్ట్ర సర్కార్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్నారు.
ఇదే సమయంలో కరెంట్ ఛార్జీల పెంపుతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ జనం నానా అగచాట్లు పడుతుంటే వడ్ల పేరుతో టీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కావాలని తమపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి.
Also Read : తమిళిసై సంచలన కామెంట్స్