YS Jagan : దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రత్యేకించి వలంటీర్లు చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేను.
ఇక ఇన్నాళ్ల పాటు మీరు ముఖ్యమైన మంత్రి పదవులు చేపట్టారు. మీ పనితీరు ప్రశంసనీయం. ఇక నుంచి మీరంతా పార్టీ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది.
మీకు ఎప్పుడూ ఈ ప్లేస్ ఉంటుందని స్పష్టం చేస్తున్నా. ఏపీ కేబినెట్ లో కొలువు తీరిన 24 మంది తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.
ఈ మేరకు రాజీనామా పత్రాలను సీఎం జగన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా చివరి సమావేశంలో జగన్ రెడ్డి(YS Jagan) దిశా నిర్దేశం చేశారు. మీ సమర్థతను, సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. కానీ ఈ సందర్భంలో మన మధ్య గౌతం రెడ్డి లేక పోవడం బాధగా ఉందన్నారు.
ఇక నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సరిగా అమలు అవుతున్నాయా లేదా అన్నది చూడాల్సిన బాధ్యత మీదే. రాబోయే కాలం మనదే. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.
ఇక కావాల్సిందల్లా ఇప్పుడున్న మెజారిటీ కంటే మరికొన్ని సీట్లు కైవసం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. పార్టీ బాధ్యతలు స్వీకరించిన మీపైనే ఎక్కువ భారం ఉంటుందన్నారు సీఎం.
మీతో పాటు పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకుని తీసుకు రావాల్సింది మీరేనని మరోసారి జగన్ రెడ్డి (YS Jagan) స్పష్టం చేశారు. ఇక మంత్రివర్గం నుంచి తప్పించిన వారికి జిల్లా అభివృద్ధి మండళ్ల చీఫ్ లుగా నియమిస్తున్నట్లు ప్రకటంచారు సీఎం.
వెయ్యి రోజుల పాటు మీరంతా అద్భుతంగా పని చేశారంటూ కితాబు ఇచ్చారు.
Also Read : వలంటీర్లకు వందనం సేవలకు సలాం