Sharad Yadav : కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం రాహుల్ గాంధీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్(Sharad Yadav) ను మర్యాద పూర్వకంగా కలిశారు ఢిల్లీలో. ఈ సందర్భంగా శరద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. గాంధీ ఫ్యామిలీని తప్పించాలంటూ డిమాండ్ చేయడం కలకలం రేగింది.
కేంద్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ సర్కార కు ధీటైన జవాబు చెప్పాలంటే కాంగ్రెస పార్టీకి చీఫ్ గా రాహుల్ గాంధీ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు శరద్ యాదవ్ .
బీహార్ లో తన పార్టీని ఇటీవలే ఆర్జేడీలో విలీనం చేశారు. రాహుల్ గాంధీ పరిపక్వత కలిగిన నాయకుడు. ఆయనకు ఆ పదవి కరెక్ట్ అని స్పష్టం చేశారు. ఇద్దరు కొంత సేపు మాట్లాడుకున్నారు.
అనంతరం రాహుల్ గాంధీ సైతం బీజేపీని టార్గెట్ చేశారు. ఈరోజు దేశం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ద్వేషం వ్యాప్తి చెందుతోంది. అంతే కాదు దేశం నిట్ట నిలువునా రెండుగా చీలి పోయే దశకు చేరుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
దేశాన్ని ఒకేతాటి పైకి తీసుకు రావాలంటే అన్ని పార్టీలు ఒకే భాగస్వామ్య పక్షంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గత మూడు సంవత్సరాలుగా మీడియా, సంస్థలు, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ లు నిజాలను దాచి పెట్టారంటూ ఆరోపించారు.
మెల్లగా నిజం బయట పడుతుంది. శ్రీలంకలో అదే జరుగుతోందన్నారు.
Also Read : టీఎంసీ నేత హత్యపై సీబీఐ విచారణ