Putin Daughters : ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో నిరవధిక యుద్దాన్ని కొనసాగిస్తున్న రష్యా చీఫ్ పుతిన్(Putin Daughters )కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన కూతుళ్ళు మారియా, కేటరీనా లకు సంబంధించిన ఆస్తులపై ఆంక్షలు విధించింది ఇప్పటికే అమెరికా.
దాని బాటలోనే యూరోపియన్ యూనియన్ చేరింది. ఆ ఇద్దరి పై నిషేధం విధిస్తున్నట్లు(Putin Daughters )ప్రకటించింది. వీరికి సంబంధించిన ఆస్తులను స్తంభింప చేయడంతో పాటు వారిపై కూడా ఈ బ్యాన్ ఉంటుందని తెలిపింది.
ఉక్రెయిన్ లో రష్యా సైనిక చర్యను నిరసిస్తూ ఈ అసాధారణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యూయూ స్పష్టం చేసింది. అంతే కాకుండా రష్యాకు చెందిన నౌకలను ఈయూ పరిధిలోని రేవుల్లోకి అనుమతించ బోమంటూ పేర్కొంది.
అంతే కాకుండా మరో షాక్ ఇచ్చింది ఈయూ. బొగ్గు దిగుమతులపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. కాగా ఆయా సభ్య దేశాలు ఇంకా ఈ నిర్ణయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం యూరోపియన్ కంట్రీస్ ఎక్కువగా రష్యా పై ఆధారపడ్డాయి. గ్యాస్, ఆయిల్ ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం ఈయూ రూ. 440 కోట్ల డాలర్ల విలువ చేసే బొగ్గును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది.
ఒకవేళ దీనిపై గనుక ఆంక్షలు లేదా నిషేధం విధించినట్లయితే రష్యాకు జరిగే ఇబ్బంది మాటేమిటో కానీ పూర్తిగా యూరోపియన్ దేశాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.
దీనిని తట్టుకోవడం కష్టం. గ్యాస్ సరఫరా అన్నది ప్రధానం. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసేందుకు రెడీగా ఉంది. దీంతో ఆ దేశానికి ఎలాంటి బెంగ లేదన్నమాట.
Also Read : రష్యా రాకెట్ దాడిలో 35 మంది మృతి