Imran Khan : పీఎం ఇమ్రాన్ ఖాన్ ఖేల్ ఖ‌తం

రాజ‌కీయ చ‌ద‌రంగంలో క్లీన్ బౌల్డ్

Imran Khan  : గ‌త కొంత కాలంగా కొన‌సాగుతూ వ‌స్తున్న రాజ‌కీయ అనిశ్చితికి తెర ప‌డింది పాకిస్తాన్ లో. ఈ మ‌ధ్య‌లో అనేక నాట‌కీయ ప‌రిణామాలు చేసుకున్నాయి. అవిశ్వాస తీర్మానం వీగి పోయింది.

సంక్షోభానికి ముగింపు ప‌డింది. దీంతో ప్ర‌ధాన మంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ (Imran Khan )త‌న ప‌ద‌విని కోల్పోయారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ లో ప్ర‌తిప‌క్షాలు ఖాన్ పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాయి.

అనేక సార్లు వాయిదా వేస్తూ వ‌చ్చారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఈ త‌రుణంలో ప్ర‌తిప‌క్షాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి.

దీంతో డిప్యూటీ స్పీక‌ర్ అవిశ్వాస తీర్మానం ర‌ద్దు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది కోర్టు ధ‌ర్మాస‌నం. ఎట్టి ప‌రిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం చేప‌ట్టాల‌ని ఆదేశించింది.

దీంతో శ‌నివారం రాత్రి వ‌ర‌కు స‌స్పెన్స్ కొన‌సాగింది. దాదాపు 14 గంట‌ల పాటు కొన‌సాగింది ఈ ప్ర‌క్రియ‌. ఎట్ట‌కేల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది ఇమ్రాన్ ఖాన్ కు. అవిశ్వాస తీర్మానం ద్వారా మాజీ కెప్టెన ను సాగనంపింది.

ఇదిలా ఉండ‌గా 1948లో స్వాతంత్రం సిద్ధించిన ఇన్నేళ్ల త‌ర్వాత ఆ దేశ చ‌రిత్ర‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని కొల్పోయిన తొలి ప్ర‌ధాన మంత్రిగా ఇమ్రాన్ ఛాన్ చ‌రిత్ర సృష్టించారు.

ఆదివారం తెల్ల వారు జామున అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జ‌రిగింది. ఇమ్రాన్ ఖాన్ కు వ్య‌తిరేకంగా 174 ఓట్లు వ‌చ్చిన‌ట్లు జాతీయ అసెంబ్లీ స్పీక‌ర్ సాదిఖ్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న ప‌ద‌విని కోల్పోయారు. కేవ‌లం 2 ఓట్ల తేడాతో త‌న ప‌వ‌ర్ కోల్పాయారు.

Also Read : నాలుగు నెల‌ల‌కోసారి కొత్త వేరియంట్

Leave A Reply

Your Email Id will not be published!