Imran Khan : అవిశ్వాస తీర్మానంలో రెండు ఓట్ల తేడాతో తన పదవిని కోల్పోయారు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 342 సభ్యులకు గాను 170 మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు.
దీంతో ఇమ్రాన్ ఖాన్ 2 ఓట్ల తేడాతో తన పదవిని కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ప్రతిపక్షాలపై అమెరికాపై నోరు పారేసుకుంటూ వచ్చిన ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కు కోలుకోలేని షాక్ తగిలింది.
ఈ తరుణంలో ఆయన అమెరికాను టార్గెట్ చేశారు. దేశంలోని మీడియాను ఏకి పారేశారు. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తన పదవిని అవిశ్వాస తీర్మానం ద్వారా కోల్పోయిన మొదటి ప్రధాన మంత్రి కావడం విశేషం.
1948 తర్వాత పాకిస్తాన్ దేశ చరిత్రలో ఒక ప్రధాని నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా పదవిని కోల్పోవడం ఇదే ప్రథమం. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా, ఆల్ రౌండర్ గా వరల్డ్ వైడ్ గా పేరొందారు ఇమ్రాన్ ఖాన్.
ఆ దేశానికి మొదటి సారిగా వరల్డ్ కప్ ను తీసుకు వచ్చిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఎన్నో రికార్డుల ఆయనపై నమోదై ఉన్నాయి. ఈ సమయంలో ఆయనపై ఎనలేని అవినీతి, ఆరోపణలు ఉన్నాయి.
ఈ తరుణంలో తన పదవిని కోల్పోవడంతో తన అధికారిక నివాసం నుంచి ఖాళీ చేసి వెళ్లి పోయాడు ఇమ్రాన్ ఖాన్. ఇదిలా ఉండగా ఆయన పాకిస్తాన్ ను విడిచి వెళ్లకుండా ఆదేశించాలని కోరుతూ ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇక ప్రతిపక్షాలు తమ సంకీర్ణ ప్రధానమంత్రి అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ ను ఎన్నుకున్నారు. ఆయనే తదుపరి ప్రధానిగా ఎన్నిక కానున్నారు.
Also Read : పీఎం ఇమ్రాన్ ఖాన్ ఖేల్ ఖతం