Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన కామెంట్స్ చేశారు. పంజాబ్ యువత జాబ్స్ కోసం ఇతర దేశాలకు వెళ్లడం ఇక నుంచి ఉండబోదని స్పష్టం చేశారు సీఎం.
మనోళ్లే కాదు విదేశాలకు చెందిన వారు కూడా మన రాష్ట్రంలో జాబ్స్ చేసేందుకు వచ్చే రోజు తప్పకుండా వస్తుందని చెప్పారు. ఆ రకంగా జాబ్స్ క్రియేట్ చేసేందుకు తాము ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.
అయితే ఈ ఏడాది కూడా 3 లక్షల మంది ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. మీరంతా అక్కడికి వెళ్లవద్దని కోరారు. బ్రెయిన్ డ్రైయిన్ గురించి ప్రస్తావించారు సీఎం(Bhagwant Mann).
శ్వేత జాతీయుల గురించి , ఇతర దేశాలను పొగడడం మాను కోవాలని సూచించారు. ముందు రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి ఫోకస్ పెట్టాలన్నారు. తాము పవర్ లోకి వచ్చాక కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు భగవంత్ మాన్(Bhagwant Mann).
ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని సీఎం తప్పు పట్టారు. వాళ్లు ఎన్ని డబ్బులు సంపాదిస్తారన్నది తమకు ముఖ్యం కాదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా ఉండేందుకు వీలు లేదన్నారు.
పంజాబ్ లో ఉద్యోగాల కోసం విదేశీయులు వచ్చే వాతావరణాన్ని తాము సృష్టించ బోతున్నామని జోష్యం చెప్పారు. జాబ్స్ కోసం ఇతర దేశాలకు వెళ్లాలంటే రూ. 15 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు.
తరుణంలో ఇక్కడే ఉపాధి కల్పించేలా చేస్తామని స్పష్టం చేశారు భగవంత్ మాన్. ఈ సందర్భంగా పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరా సీఎంపై నిప్పులు చెరిగారు. ముందు జాబ్స్ ఇచ్చే విషయంపై ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read : నాలుగు నెలలకోసారి కొత్త వేరియంట్