Mayawati : రాహుల్ కామెంట్స్ పై మాయావ‌తి క‌న్నెర్ర‌

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు స‌త్య‌దూరం

Mayawati : బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ కుమారి మాయావ‌తి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె ఇవాళ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.

త‌న‌ను అనే ముందు త‌న పార్టీని చ‌క్క‌దిద్దు కోవాల‌ని సూచించారు. ఇదిలా ఉండ‌గా రాహుల్ మాయావ‌తిపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆమెకు ఇటీవ‌ల యూపీలో జ‌రిగిన ఎన్నికల్లో సీఎం పోస్ట్ ఆఫ‌ర్ ఇచ్చామ‌ని కానీ ఆమె రెస్పాండ్ కాలేద‌న్నారు.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు భ‌య‌ప‌డి బీఎస్పీ చీఫ్ మాయావ‌తి (Mayawati) బ‌హిరంగంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

దీనిపై ఇవాళ సీరియ‌స్ గా స్పందించారు మాయావ‌తి. తానేమీ ఎవ‌రికీ త‌ల వంచ‌న‌ని, ఇంకెవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌పై ఫోక‌స్ పెట్టే బ‌దులు యూపీలో త‌మ పార్టీ ఎందుకు ఓడి పోయిందో దృష్టి పెడితే బావుండేందంటూ ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే ముందు ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించాలి. వారు బీజేపీ నుంచి గెల‌వ‌లేక పోయారు.

కుంభ‌కోణాల‌కు కేరాఫ్ ఆ పార్టీ అంటూ ఆరోపించారు మాయావ‌తి(Mayawati) . పంజాబ్ లో ఉన్న అధికారాన్ని చేజేతులారా కోల్పోయార‌ని మీరా త‌న‌కు నీతులు చెప్పేదంటూ మండిప‌డ్డారు.

ఇదిలా ఉండ‌గా మాజీ ప్ర‌ధాన మంత్రి దివంగ‌త రాజీవ్ గాంధీ సైతం బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ప‌రువు తీసేందుకు ప్ర‌య‌త్నంచారంటూ మాయావ‌తి ఆరోపించారు. ప్రియాంక గాంధీ సైతం ఇలాగే అంటోంద‌న్నారు.

Also Read : ఎన్నిక‌ల్లో బీజేపీకి మాయ‌వ‌తి స‌పోర్ట్

Leave A Reply

Your Email Id will not be published!