KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ నీకు దమ్ముంటే నన్ను జైళ్లో పెట్టు అని సవాల్ విసిరారు.
ఈడీ, ఐటీ, సీబీఐ ..ఎవరిని పంపిస్తావో చెప్పు అని అన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర సర్కార్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందంటూ ఆరోపించారు కేసీఆర్(KCR ). ఎవరైనా ఎదురు తిరిగినా లేదా మోదీని ప్రశ్నించినా వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడతారని మండిపడ్డారు.
భారతీయ జనతా పార్టీలో అంతా సచ్చీలురే ఉన్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. తనను జైలుకు పంపుతామని కొందరు లపూట్ గాళ్లు బీజేపీ నేతలు అంటున్నారని దమ్ముంటే రావాలని అన్నారు.
ఊరికే మొరిగితే కాదని రండి అరెస్ట్ చేయాలంటూ పిలుపునిచ్చారు కేసీఆర్(KCR ). కేంద్ర సర్కార్ పంట మార్పిడి చేయాలని సూచించిందని, ఇదే విషయాన్ని తాము రైతులకు చెప్పామన్నారు.
కానీ ఉద్దేశ పూర్వకంగానే ధాన్యం పండించాలని, తాము కొంటామని కొట్లాట పెట్టించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాదా అని నిలదీశారు. బండి సంజయ్ కూడా రైతులను రెచ్చ గొట్టాడని ఇదేనా రాజకీయం అని ప్రశ్నించారు.
తాము రైతుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తుంటే తమకు పోటీగా బీజేపీ రాష్ట్రంలో ఆందోళన చేపడుతోందని అన్నారు కేసీఆర్. కేంద్రం దిగి వచ్చేంత వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
Also Read : మతం పేరుతో బీజేపీ రాజకీయం