Amit Shah : షా కామెంట్స్ స‌ర్వ‌త్రా సీరియ‌స్

బ‌ల‌వంతంగా హిందీని రుద్దే ప్ర‌య‌త్నం

Amit Shah : కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఇప్ప‌టికే కుల‌, మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు కేరాఫ్ గా మారింది ఇండియా. ఎక్క‌డ చూసినా ఘ‌ర్ష‌ణ‌లు, హ‌త్య‌లు, కేసులు, అరెస్ట్ ల‌తో అట్టుడుకుతోంది స‌మున్న‌త భార‌తం.

ఇదే స‌మ‌యంలో బీజేపీయేత‌ర వ్య‌క్తులు, కంపెనీలు, వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు, ప్ర‌భుత్వాల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. వింటే ఓకే లేదంటే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగించ‌డం అల‌వాటుగా మార్చుకుంది.

ఇదే స‌మ‌యంలో గ‌తంలో రైల్వే శాఖ‌లో హిందీలో మాత్ర‌మే బోర్డులు ఉండాల‌ని ఆదేశించింది కేంద్ర స‌ర్కార్. దీనిపై భ‌గ్గుమంది త‌మిళ‌నాడు. పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.

దీంతో దిగిరాక త‌ప్ప‌లేదు కేంద్రం. వెంట‌నే తాను జారీ చేసిన జీవోను ర‌ద్దు చేసింది. ఈ స‌మ‌యంలో ఆనాడు క‌న్నెర్ర చేసిన డీఎంకే సార‌థ్యంలోని ప్ర‌భుత్వం కొలువు తీరింది.

ఎంకే స్టాలిన్ కేంద్రంపై క‌న్నెర్ర చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా (Amit Shah)వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లకు తెర తీశారు. దేశంలో ప్ర‌తి ఒక్క‌రు ఇంగ్లీష్ భాష కాకుండా హిందీలోనే మాట్లాడాల‌ని అన్నారు.

ఆయ‌న చేసిన కామెంట్స్ పై దేశ వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. మ‌రో వైపు హిందీ భాష‌ను ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్టుగా చేసేందుకు ఈశాన్య భార‌త రాష్ట్రాలు ఒప్పుకున్నాయంటూ చెప్పారు.

షా కామెంట్స్ పై రాజ‌కీయ పార్టీలు, రాజ‌కీయేత‌ర సంస్థ‌లు తీవ్రంగా ఖండించాయి. హిందీని త‌ప్ప‌నిస‌రి చేస్తే స్థానిక భాష‌లు ప్ర‌మాదంలో ప‌డ‌తాయ‌ని హెచ్చ‌రించారు.

ఇదిలా ఉండ‌గా సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ స్పందించారు. అలాంటి జీవో ఏదీ రాలేద‌న్నారు.

Also Read : సునీల్ జాఖ‌ర్ కు షోకాజ్ నోటీస్

Leave A Reply

Your Email Id will not be published!