Punjab Govt : ఆర్డీఎఫ్ చ‌ట్టాన్ని స‌వ‌రించిన పంజాబ్

రూ. 1,050 కోట్ల నిధులు క్లియ‌ర్

Punjab Govt  : భ‌గ‌వంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ స‌ర్కార్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఆర్డీఎఫ్ చ‌ట్టాన్ని స‌వ‌రించింది. కేంద్రానికి సంబంధించిన రూ. 1,050 కోట్లను క్లియ‌ర్ చేసింది.

గ‌త ఖ‌రీఫ్ సీజ‌న్ లో వ‌రి పంట సేక‌ర‌ణ‌పై రాష్ట్ర స‌ర్కార్ విధించిన ఆర్డీఎఫ్ విడుద‌ల‌కు సంబంధించి స‌వ‌ర‌ణ చేసింది. ఆర్డీఎఫ్ అంటే గ్రామీణాభివృద్ధి నిధి.

రాష్ట్రంలో ధాన్యం సేక‌ర‌ణ‌, మార్కెటింగ్ వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేసేందుకు సేక‌రించిన నిల్వ‌ల‌ను నిల్వ చేసేందుకు మండీల‌లో సౌక‌ర్యాల‌ను పెంచేందుకు ఈ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నుంది.

పంజాబ్ రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ (స‌వ‌ర‌ణ ) ఆర్డినెన్స్ -2022 కి ఆమోదం తెలిపింది పంజాబ్ స‌ర్కార్. రూ. 1,050 కోట్ల మేర‌కు పెండింగ్ లో ఉన్న గ్రామీణాభివృద్ధి నిధుల‌ను పొందేందుకు గాను పంజాబ్ మంత్రివ‌ర్గం(Punjab Govt )బుధ‌వారం క్లియ‌ర్ చేసింది.

చండీగ‌ఢ్ లో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. పంజాబ్ రూర‌ల్ డెవ‌ప‌ల్ మెంట్ యాక్ట్ 1987 , పిబ్ర‌వ‌రి 2020లో కేంద్ర ఆహార , ప్ర‌జా పంపిణీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన స‌వ‌రించిన సూత్రాల‌కు అనుగుణంగా స‌వ‌రించిన‌ట్లు పంజాబ్ ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి తెలిపారు.

స‌వ‌ర‌ణ కార‌ణంగా ప్ర‌స్తుత గోధుమ పంట సేక‌ర‌ణ స‌మ‌యంలో క‌నీసం రూ. 900 కోట్ల ఆర్డీఎఫ్ ను కూడా కేంద్రం విడుద‌ల చేయ‌నుంది.

ఆర్డీఎఫ్ మండీల‌కు అప్రోచ్ రోడ్లు, కొనుగోలు కేంద్రాలు, వీధి దీపాల నిర్మాణం, కొత్త మండీల నిర్మాణం, పాత వాటి అభివృద్ధికి ఖ‌ర్చు చేస్తారు ఈ నిధుల‌ను.

తాగు నీరు, పారిశుధ్యం స‌ర‌ఫ‌రా చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తారు. సేక‌ర‌ణ‌లో నిమ‌గ్న‌మైన రైతులు, కార్మికుల కోసం విశ్రాంతి గృహాలు, నైట్ షెల్ట‌ర్లు , షెడ్ ల‌ను నిర్మిస్తారు.

Also Read : ఆరు నూరైనా రాజీనామా చేయ‌ను

Leave A Reply

Your Email Id will not be published!