YS Jagan : అగ్నిప్ర‌మాదంపై జ‌గ‌న్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాల‌కు రూ. 25 లక్ష‌లు

YS Jagan  : ఏపీలోని ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెం పోర‌స్ కంపెనీలో చోటు చేసుకున్న అగ్ని ప్ర‌మ‌దంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని హుటా హుటిన విజ‌య‌వాడ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

విష‌యం తెలిసిన వెంట‌నే సీఎం జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 25 ల‌క్ష‌లు , తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ. 5 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ. 2 ల‌క్ష‌లు ప‌రిహారంగా ప్ర‌క‌టించారు.

ఈ ఘ‌ట‌నపై పూర్తి ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు జ‌గ‌న్(YS Jagan ). జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీలు త‌న‌కు నివేదిక అంద‌జేయాల‌ని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప్ర‌మాదంపై సీఎస్ సీఎంకు వివ‌రించారు. గాయ‌ప‌డిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సాయం అందించాల‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా అర్ధ‌రాత్రి పోర‌స్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. యూనిట్ -4లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించగా ప‌లువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

మృతుల్లో బీహార్ కు చెందిన వారున్నారు. గాయ‌పడిన వారిని నూజివీడు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి విజ‌య‌వాడ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు మెరుగైన చికిత్స కోసం. ఆస్ప‌త్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా బాధితుల‌కు మెరుగైన చికిత్స అంద‌జేస్తున్న‌ట్లు ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ వెల్ల‌డించారు. ఇక ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నే దానిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ద‌ర్యాప్తు చేస్తే అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంది.

Also Read : ఏపీలో సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీల వ‌డ్డ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!