Rakesh Tikait : భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ నిపుణుడు, ఆర్థిక వేత్త , అణగారిన వర్గాల ప్రజల గొంతుక అంబేద్కర్ అని కొనియాడారు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, కిసాన్ మోర్చా రైతు నేత రాకేశ్ తికాయత్(Rakesh Tikait).
భారత దేశ మొదటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి ఇవాళ. ఈ సందర్బంగా అంబేద్కర్ కు వినమ్రంగా నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు రాకేశ్ తికాయత్.
ఇవాళ ట్విట్టర్ వేదికగా అంబేద్కర్ ను స్మరించుకున్నారు. ఈ దేశంలో బడుగులు, బలహీనులు, పేదలు, మైనార్టీలు, అణగారిన వర్గాల వారందరికీ స్పూర్తి దాయకంగా , బలమైన గొంతుకగా నిలిచారని కొనియాడారు.
ఆయన వల్లనే ఇవాళ ఈ మాత్రం దేశంలో పౌరులకు, ప్రజలకు హక్కులు అనేవి ఉన్నాయన్న ఎరుక కలిగిందని పేర్కొన్నారు. ఈ దేశం గర్వించదగిన నాయకులలో అంబేద్కర్ ఒకరని, ఆయన మార్గంలోనే తాము నడుస్తామన్నారు.
అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. అంబేద్కర్ గనుక రాజ్యాంగాన్ని రాయక పోయి ఉండి ఉంటే తాము ఇవాళ గొంతు విప్పే వాళ్లం కాదన్నారు.
తర తరాలుగా బానిస బతుకులు బతికే వారమన్నారు. దేశ వ్యాప్తంగా ప్రపంచాన్ని ఆకర్షించిన రైతు ఉద్యమానికి తన తండ్రితో పాటు రైతులు, అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తి ప్రధాన కారణమని పేర్కొన్నారు బీకేయూ అగ్ర నేత రాకేశ్ తికాయత్(Rakesh Tikait).
ప్రతి ఒక్కరి గొంతుకకు ఆయన ప్రాణమిచ్చారని సూర్య చంద్రులు ఉన్నంత కాలం అంబేద్కర్ బతికే ఉంటారని కొనియాడారు.
Also Read : ఆర్డీఎఫ్ చట్టాన్ని సవరించిన పంజాబ్