Bhagwant Mann : తాను లేకుండా ఇటీవల ఆఫీసర్లతో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్ష జరపడం పంజాబ్ లో కలకలం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశాయి విపక్షాలు.
సీఎం భగవంత్ మాన్ రబ్బరు స్టాంపు మాత్రమేనని, పవర్ అంతా కేజ్రీవాల్ చేతుల్లో ఉందన్ని ఆరోపించాయి. అంతే కాదు రిమోట్ కంట్రోల్ అంతా అక్కడి నుంచే ఆపరేట్ అవుతోందంటూ మండిపడ్డారు.
దీనిపై స్పందించారు భగవంత్ మాన్(Bhagwant Mann). తానే సీఎంతో మాట్లాడాలని పంపించానని తెలిపారు. తాజాగా మెరుగైన శిక్షణ కోసం ఇజ్రాయిల్ కు పంపిస్తానని చెప్పారు భగవంత్ మాన్. శిక్షణ ప్రయోజనాల కోసం అధికారులను పంపించడం తన నిర్ణయమని ప్రకటించారు సీఎం.
మెరుగైన నైపుణ్యం కోసం వీలైతే గుజరాత్, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, ఇజ్రాయెల్ కు పంపిస్తానని స్పష్టం చేశారు. దానికి ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెప్పాలంటూ ఎదురు ప్రశ్ని వేశారు.
భగవంత్ మాన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్నది మా ప్రభుత్వమే. విద్య, విద్యుత్ , ఆరోగ్యం వంటి రంగాలలో నిపుణులు. వారి సలహాలు, సూచనలు ఎందుకు తీసుకోకూడదన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఎవరు ప్రతిపక్షం. ఎక్కడ ఉందని నిలదీశారు. తామ ప్రచారం కోసం విమర్శించడం పనిగా పెట్టుకోవడం తగదన్నారు.
అధికారులను ట్రైనింగ్ కోసం పంపించింది నేనే. మంచి విషయాలు నేర్చుకునేందుకు ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చన్నారు. ఈ సందర్భంగా భగవంత్ మాన్ సీరియస్ అయ్యారు. విపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలని కోరాడు.
Also Read : తమిళం ముఖ్యం హిందీని ఒప్పుకోం