KS Eshwarappa : కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa) సంచలన ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈనెల 15న శుక్రవారం మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు.
కాంట్రాక్టర్ సూసైడ్ కు పాల్పడడం, మంత్రితో పాటు ఆయన అనుచరులు తనను ఇబ్బందులకు గురి చేశారంటూ ఆరోపించారు. మంగళవారం ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది.
మృతుడు తమ్ముడు చేసిన ఫిర్యాదు మేరకు మంత్రితో పాటు అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ తరుణంలో విచారణ జరుగుతోందని, ఈశ్వరప్ప కేబినెట్ లోనే ఉంటారని ప్రకటించారు సీఎం బసవరాజ్ బొమ్మై.
ఆయన వెల్లడించిన కొద్ది సేపటికే మంత్రి ఆకస్మికంగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా కాంట్రాక్టర్ మృతికి కారణమైన మంత్రి ఈశ్వరప్ప(KS Eshwarappa) రాజీనామా చేయాలంటూ ఇవాళ బెంగళూరులో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ సారథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఇదిలా ఉండగా మీడియాతో మాట్లాడిన ఈశ్వరప్ప తాను రేపు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించి విస్తు పోయేలా చేశారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకే హై కమాండ్ రంగంలోకి దిగిందని, ఆయనను తప్పు కోవాలని సూచించినట్లు సమాచారం. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రకటించిన ఈశ్వరప్ప ఉన్నట్టుండి స్వరం మార్చారు.
Also Read : ఆఫీసర్లను ఇజ్రాయెల్ కు పంపిస్తా