Zelensky : ప్రపంచాన్ని బేఖాతర్ చేస్తూ రష్యా తన తీరు మార్చు కోవడం లేదు. ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. దేశ రాజధాని కీవ్ పై బాంబులు, క్షిపణుల మోత మోగిస్తోంది.
ఒకానొక దశలో పూర్తిగా నామ రూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు రష్యా చీఫ్ పుతిన్. ఇప్పటికే అమెరికా, యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్, బ్రిటన్ , తదితర దేశాలన్నీ ఆర్థిక ఆంక్షలు విధించాయి.
కానీ వెనక్కి తగ్గడం లేదు. ఈ తరుణంలో మరో బాంబు లాంటి వార్త పేల్చాడు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ(Zelensky ). రష్యా అణ్వాయుధాలను ఉపయోగించే ప్రమాదం లేక పోలేదని హెచ్చరించారు.
ఇందుకు తాము సిద్దంగా ఉండాలంటూ ప్రకటించాడు. పుతిన్ కు కావాల్సింది ఉక్రెయిన్ కాదని తనను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడంటూ ఆరోపించాడు జెలెన్ స్కీ.
ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందంటూ వాపోయాడు. ఈ తరుణంలో యావత్ ప్రపంచమంతా ఒక్క తాటిపైకి రావాలంటూ పిలుపునిచ్చాడు ఉక్రెయిన్ చీఫ్.
తాము కూడా వేచి చూసే ధోరణిలో ఉండ కూడదన్నాడు. అందుకు సిద్దం కావాలని కోరాడు. రష్యా అణ్వాయుధాలను ఉపయోగించాలని నిర్ణయించుకునే క్షణం కోసం వేచి ఉండ కూడదని , అందుకు ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాలని కోరాడు.
యాంటీ రేడియేషన్ మెడిసిన్ , ఎయిర్ రైడ్ షెల్టర్లు అవసరం అని తెలిపాడు జెలెన్ స్కీ. పుతిన్ పొంచి ఉన్న ముప్పు గురించి ప్రపంచం ఆందోళన చెందక తప్పదని హెచ్చరించాడు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ కాదు కామెడీ ఖాన్