Dilip Walse Patil : భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్(Dilip Walse Patil ). దేశంలో జరుగుతున్న అల్లర్ల వెనుక బీజేపీ శక్తులు ఉన్నాయంటూ ఆరోపించారు.
ప్రధానంగా ఢిల్లీలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా చోటు చేసుకున్న ఊరేగింపులో చోటు చేసుకున్న ఘర్షణలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
బీజేపీ, దాని అనుబంధ శక్తులు, సంస్థలు మహారాష్ట్రలో సైతం అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హోం శాఖ మంత్రి.
ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం తమ వద్ద ఉందని తెలిపారు పాటిల్. నిఘా వర్గాల హెచ్చరికలు, ఇచ్చిన సమాచారం మేరకు తాము అలర్ట్ అయ్యామని చెప్పారు.
దీంతో తాము పోలీసులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ఒకవేళ భంగం కలిగించాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు దిలీప్ వాల్సే పాటిల్.
ఇదిలా ఉండగా మహా నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని డిమాండ్ చేశారు.
అంతే కాదు మరాఠా సర్కార్ కు మే 3 వరకు గడువు కూడా ఇచ్చారు. ఒకవేళ చర్యలు తీసుకోక పోతే తాము మసీదుల వద్దే లౌడ్ స్పీకర్ల ద్వారా హనుమాన్ చాలీసా వినిపిస్తామన్నారు. రాజ్ థాకరే ఇచ్చిన డెడ్ లైన్ వెనుక బీజేపీ కేట్ర కోణం దాగి ఉందంటూ ఆరోపించారు.
Also Read : అది ‘యూనియన్ ప్రచారక్ సంఘ్ కమిషన్’