Brinda Karat : ఈ దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ కూల్చివేతల వెనుక ప్రధాన కారణం వేరేగా ఉందని అనిపిస్తోంది అని సంచలన ఆరోపణలు చేశారు సీపీఎం నాయకురాలు బృందా కారత్.
ఢిల్లీలోని జహంగీర్ పూరి లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, అనంతరం అక్రమ కట్టడాల పేరుతో బుల్డోజర్లతో కూల్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెంటనే కూల్చివేతలు నిలిపి వేయాలని స్టేటస్ కో ఇచ్చింది.
అయితే తమకు అందలేదంటూ రెండు గంటల పాటు కొనసాగిస్తూ పోయారు. ఇందులో ఒక వర్గానికి చెందిన వారివే ఎక్కువగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందంటూ ఆరోపించారు బృందా కారత్(Brinda Karat ).
ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని కూల్చి వేస్తారా అంటూ ప్రశ్నించారు. చట్ట బద్దమైన కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా కూల్చడం చట్ట విరుద్దమని మండిపడ్డారు.
ఈ కేసును మళ్లీ విచారించేంత వరకు నిలిపి వేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా బృందా కారత్(Brinda Karat )భౌతికంగా అడ్డుకున్నారు. హింసాత్మక ప్రాంతంలో కూల్చి వేతలను నిలిపి వేయాలంటూ కోర్టు ఆదేశాలను చూపించారు.
వివాదానికి కేంద్రంగా ఉన్న అనేక దుకాణాలు, గేట్లు, మసీదు గోడను ధ్వంసం చేశారు. సీజేఐ ఎన్వీ రమణ ఉదయాన్నే యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు.
తాను 12 గంటల సమయంలో జహంగీర్ పపూరికి చేరుకున్నా. బుల్డోజర్లు కదులుతున్నాయి. నివాసితులకు వారి వస్తువులను తరలించేందుకు కూడా సమయం ఇవ్వలేదని ఆరోపించారు బృందా కారత్.
Also Read : అమిత్ షా ఇంటిని కూల్చేస్తే బెటర్