Jignesh Mevani : అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారంటూ గుజరాత్ లోని వడ్గామ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా పేరొందిన జిగ్నేష్ మేవానిని(Jignesh Mevani) అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మేవానిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్ లోని పాలన్ పూర సర్క్యూట్ హౌస్ నుంచి అదుపులోకి తీసుకుని అహ్మదాబాద్ కు తీసుకు వెళ్లారు. ఇవాళ అసోంకు తీసుకు వెళతారు. ఆయన ఇటీవల చేసిన పోస్ట్ లు తీవ్ర వివదాలకు దారి తీశాయి.
ఆయన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్లు బ్లాక్ చేసి ఉంచడం కనిపించింది. జిగ్నేష్ మేవానీJignesh Mevani) గుజరాత్ లోని వడ్గామ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీలో చేరలేదు.
ఫిరాయింపులకు సంబంధించిన రూల్స్ ఏం చెబుతున్నాయంటే రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ ప్రకారం ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిస్తే. ఆపై ఏదైనా పార్టీలో చేరాలని భావిస్తే అతను ఆ స్థానం వదులు కోవాల్సి ఉంటుంది.
లేని పక్షంలో ఆయన లేదా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసే లేదా అనర్హుడిగా ప్రకటించే అధికారం స్పీకర్ కు ఉంటుంది. దీని వల్ల జిగ్నేష్ మేవానీ తన మద్దతును మాత్రమే కాంగ్రెస్ కు ప్రకటించారు.
ఎమ్మెల్యేను రాత్రి 11.30 నిమిషాలకు అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారడం. అది వివాదాస్పదం కావడంతో అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు మాత్రం కావాలని చేస్తున్నారంటూ ఆరోపించారు.
Also Read : కూల్చివేత చట్ట విరుద్దం – కారత్