Prashant Kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor)సమర్పించిన బ్లూ ప్రింట్ పై మరోసారి మల్లగుల్లాలు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ తో ఇప్పటికే మూడు నాలుగుసార్లు భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా రాబోయే 2024లో కాంగ్రెస్ తిరిగి పవర్ లోకి రావాలంటే ఏం చేయాలనే దానిపై పూర్తిగా నివేదిక ఇచ్చారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ పై ఓ కమిటీని ఏర్పాటు చేశారు సోనియా గాంధీ.
ఇవాళ రాజస్థాన్ సీఎం , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ , మరో సీఎం భూపేష్ బఘేల్ లు చర్చించనున్నారు. పీకే ఇచ్చిన బ్లూ ప్రింట్ పై 72 గంటల్లో నివేదిక అందజేయనున్నారు.
ప్రశాంత్ కిషోర్ తో జరిగిన నాల్గో సమావేశానికి సీనియర్ నాయకులు జై రాం రమేష్ , అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్ , సోనియా గాంధీ హాజరయ్యారు. భేటీ అనంతరం పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడారు.
ప్రశాంత్ కిషోర్ అందించిన ప్రతిపాదనలను పార్టీ రివ్యూ చేస్తోందని చెప్పారు. ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని చర్చిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
సోనియా గాంధీ పీకేను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక పీకే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో సపోర్ట్ చేశారు.
ఈ రెండు రాష్ట్రాలలో డీఎంకే, టీఎంసీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) రాకను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అభ్యంతరం తెలిపే చాన్స్ ఉందని సోనియా భావిస్తున్నారు..
Also Read : శశికళకు పోలీసుల నోటీసులు