UK PM John Son : భారత్ తో మైత్రీ బంధానికే ప్రయారిటీ – జాన్సన్
భారత్ కు చేరుకున్న బోరిస్ జాన్సన్
UK PM John Son : ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(UK PM John Son) రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్నారు.
ఇందులో భాగంగా గురువారం ఉదయం గుజరాత్ లోని అహ్మదాబాద్ కు విచ్చేసిన ఆయనకు సాదర స్వాగతం లభించింది. శుక్రవారం బ్రిటన్ పీఎం భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు.
అక్కడ ఇరువురు ప్రధానులు వాణిజ్యం, రక్షణ, తదితర ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బిలియన్ల కొద్దీ పౌండ్ల ద్వారా పెంచగల స్వేచ్ఛా , వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది సాధించేందుకు ఇండియాకు మరిన్ని వీసాలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని రాయిటర్స్ సంస్థ నివేదించింది కూడా. భారత్ తో శాశ్వత సంబంధం కలిగి ఉండేందుకు తాను ఇష్ట పడతానని తెలిపారు. తమ దేశానికి వచ్చే ప్రతిభావంతులకు తాము అనుకూలంగా ఉంటామని స్పష్టం చేశారు.
ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు భారత్ తో బంధం ముఖ్యమన్నారు. ప్రగతిశీల విధానాన్ని కలిగి ఉంటామన్నారు. బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. వ్యాపార వేత్త గౌతమ్ అదానీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది.
అనంతరం వడోదరకు వెళతారు. అక్కడ జేసీబీ ప్లాంట్ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీకి వెళతారు.
సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. రాబోయే 25 ఏళ్ల పాటు మరింత బంధం బలపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read : కూల్చివేత చట్ట విరుద్దం – కారత్