Kapil Sibal Chidambaram : కూల్చివేత‌ల‌పై కాంగ్రెస్ క‌న్నెర్ర

ఫ‌క్తు ప‌క్కా రాజ‌కీయ క‌క్ష సాధింపే

Kapil Sibal Chidambaram : ఢిల్లీలోని జ‌హంగీర్ పూరిలో చోటు చేసుకున్న హింసాకాండ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని ప్ర‌ధాన నిందిత‌లుగా చేర్చారు.

ఇదే స‌మ‌యంలో ఆక్ర‌మ‌ణ‌లు ఉన్నాయంటూ బోల్డోజ‌ర్ల‌తో ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా కూల్చివేత‌లు ప్రారంభించారు.

దీనిపై తాత్కాలికంగా నిలిపి వేయాలంటూ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ నేతృత్శంలోని ధ‌ర్మాస‌నం కీల‌క తీర్పు వెలువ‌రించింది.

20న ఉద‌యం ఉత్త‌ర్వులు ఇచ్చినా మ‌ధ్యాహ్నం దాకా ఎలాంటి నిలుపుద‌ల చేయ‌కుండానే కంటిన్యూగా కూల్చ‌డం చేశారు. దీంతో రంగంలోకి దిగింది సీపీఎం నాయ‌కురాలు బృందా కార‌త్. ఆమె సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డ‌ర్ కాపీని చూపించినా ప‌ట్టించుకోక పోవ‌డంతో సీరియ‌స్ అయ్యారు.

బాధితులంతా ఆమె వైపు నిల‌బ‌డ‌డంతో నిలిపి వేశారు. ఇవాళ ఈ ఆక్ర‌మ‌ణ‌ల విష‌యంపై తుది తీర్పు వెలువ‌రించ‌నుంది ధ‌ర్మాస‌నం. ఈ సంద‌ర్భంగా కూల్చివేత‌ల వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు క‌పిల్ సిబ‌ల్ , పి. చిదంబ‌రం (Kapil Sibal Chidambaram)నిప్పులు చెరిగారు.

పూర్తిగా రాజ‌కీయంగా బీజేపీ ల‌బ్ది పొందేందుకే ఇలాంటి ప‌నులు చేస్తోందంటూ ఆరోపించారు. ఓ వైపు కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను సైతం ధిక్క‌రించారంటూ మండిప‌డ్డారు.

ఈ దేశంలో బీజేపీ కావాల‌ని అల్ల‌ర్ల‌కు పాల్ప‌డుతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రీ ప్లాన్డ్ కుట్ర‌గా వారు అభివ‌ర్ణించారు.

ఈ కూల్చివేత‌ల‌ను టార్గెటెడ్ బుల్డోజింగ్ అంటూ కామెంట్ చేశారు ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ నాయ‌కులు. ఏక‌ప‌క్షంగా దాడుల‌కు తెగ‌బ‌డ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : మ‌హాత్ముడి జీవితం స్పూర్తి దాయ‌కం

Leave A Reply

Your Email Id will not be published!