Supreme Court : జ‌హంగీర్ పూరి కూల్చివేత‌ల‌పై సుప్రీం ఆగ్ర‌హం

త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చే వ‌ర‌కు నిలిపి వేయాలి

Supreme Court : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన దేశ రాజ‌ధాని ఢిల్లీ జ‌హంగీర్ పూరి లో అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌పై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియ‌స్ అయ్యింది. ఈ మేర‌కు వాటిని చేప‌ట్ట‌రాదంటూ స్టే ఇచ్చింది.

తాము త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చేంత వ‌ర‌కు కూల్చి వేత‌లు చేప‌ట్ట రాదంటూ స్ప‌ష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్ప‌టికే తాము వెలువ‌రించిన య‌థాత‌ళథ స్థితిని కొన‌సాగించాల‌ని పేర్కొంది.

ఇదిలా ఉండా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిన్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కోర్టు ఉత్త‌ర్వుల‌ను బేఖాత‌ర్ చేస్తూ ఆక్ర‌మ‌ణ‌లు ఉన్నాయంటూ కూల్చివేత‌లు ప్రారంభించాయి.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చినా ఎందుకు అమ‌లు చేయ‌లేదంటూ మండిప‌డింది.

నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ – ఎన్డీఎం మేయ‌ర్ కూల్చి వేత‌లు కొన‌సాగించ‌డంపై సీరియ‌స్ అయ్యింది. ఒక మేయ‌ర్ గా ఉంటూ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు ఎలా పాల్ప‌డతారంటూ ప్ర‌శ్నించింది.

దీనిని తాము ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లు తెలిపింది ధ‌ర్మాస‌నం. ఇదిలా ఉండ‌గా కేసులోని ప్ర‌తివాదులంద‌రికీ నోటీసులు జారీ చేసింది ధ‌ర్మాస‌నం. ఇందుకు గాను అఫిడ‌విట్లు దాఖ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

కాగా దేశ వ్యాప్తంగా ఈ బుల్డోజ‌ర్ల దాడులపై నిలుపుద‌ల చేస్తూ స్టే ఇవ్వాల‌న్న న్యాయ‌వాది సిబ‌ల్ వాద‌న‌ను కోర్టు తోసిపుచ్చింది.

ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది ధ‌ర్మాస‌నం. నోటీసులు ఇవ్వ‌కుండానే ఎలా కూల్చి వేస్తారంటూ బాధితులు కోర్టును ఆశ్ర‌యించారు.

Also Read : పీకే బ్లూ ప్రింట్ పై కాంగ్రెస్ ఆరా

Leave A Reply

Your Email Id will not be published!