APWC Summons : ‘చంద్ర‌బాబు..బొండ ఉమ‌’కు స‌మ‌న్లు

జారీ చేసిన మ‌హిళా క‌మిష‌న్

APWC Summons : తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు, టీడీపీ నాయ‌కుడు బొండా ఉమ‌కు ఏపీ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ (APWC Summons)శుక్ర‌వారం స‌మ‌న్లు జారీ చేసింది.

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో బాధితురాలిని ప‌రామ‌ర్శించేందుకు ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసి రెడ్డి ప‌ద్మ వెళ్లిన స‌మ‌యంలో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

ఇదే స‌మ‌యంలో బాధితురాలిని ప‌ల‌క‌రిస్తుండ‌గా బొండా ఉమ నానా దుర్భాష లాడార‌ని, ఇదే క్ర‌మంలో టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు మ‌హిళ‌న‌ని చూడ‌కుండా బెదిరించేందుకు ప్ర‌య‌త్నం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌.

అగౌర‌వ ప‌ర్చ‌డం, బాధితురాలి ఆవేద‌న‌ను విన‌నీయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ మేర‌కు బాధితురాలిని భ‌య‌పెట్టేలా చేసిన ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు చంద్ర‌బాబు నాయుడు, బొండా ఉమ వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని మ‌హిళా క‌మిష‌న్ స‌మ‌న్లు(APWC Summons) జారీ చేసింది.

ఈనెల 27న ఉద‌యం 11 గంట‌ల‌కు ఏపీలోని మంగ‌ళ‌గిరి లోని రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఆఫీసుకు చంద్ర‌బాబు, ఉమ స్వ‌యంగా విచార‌ణ‌కు రావాల‌ని స‌మ‌న్ల‌లో జారీ చేశారు.

ఇదే విష‌యాన్ని మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ స‌మ‌న్ల‌లో ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా బాధితురాలికి రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఏపీ సీఎం రూ. 10 ల‌క్ష‌లు సాయంగా ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా విజ‌య‌వాడ ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు చేరుకున్న చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌పై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.

Also Read : టీడీపీ దాడిపై వాసిరెడ్డి ప‌ద్మ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!