Prashant Kishor : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) చర్చనీయాంశంగా మారారు. ఈసారి ఆయన వార్తల్లో ఉన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో భేటీ కావడం. ఆయన పార్టీలో చేరుతారా లేదా అన్నది ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది.
అయితే పీకే ఇచ్చిన బ్లూ ప్రింట్ లో ఆసక్తికరమైన కామెంట్స్ తో పాటు దిమ్మ తిరిగేలా వాస్తవ పరిస్థితుల గురించి కూడా సవివరంగా అందజేసినట్లు సమాచారం. ఏపీలో జగన్ తో కలిసి నడవాలని, తెలంగాణలో ఒంటరిగా నే బరిలో ఉండాలని సూచించినట్లు టాక్.
దక్షిణాదిన బీజేపీ బలహీనంగా ఉందని దానిని ఎదుర్కోవాలంటే గట్టిగా ఫోకస్ పెట్టాలని కూడా చెప్పినట్లు టాక్. పీకే ఇచ్చిన రిపోర్ట్ పై సోనియా గాంధీ పరివారం మల్లగుల్లాలు పడుతోంది.
ఇప్పటి దాకా ఈ స్ట్రాటజిస్ట్ నాలుగు సార్లకు పైగా భేటీ అయ్యారు. ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా పార్టీ పదవుల నుంచి తప్పుకోవాలని , అప్పుడే పార్టీ బలపడుతుందని కుండ బద్దలు కొట్టినట్లు టాక్.
ఇందులో భాగంగా 80 పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. త్రిమూర్తులు ( సోనియా, రాహుల్ , ప్రియాంక ) పదవులు చేపట్ట కూడదంటూ షరతు పెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సోనియా యూపిఏ చైర్మన్ గా , రాహుల్ గాంధీ పార్లమెంట్ బోర్డు చీఫ్ గా, ప్రియాంక సమన్వకర్తగా ఉంటే బెటర్ అని సూచించినట్లు సమాచారం. కాగా పీకే ఎంట్రీపై డిగ్గీ రాజా ఆసక్తికర కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
Also Read : ఐఐటీ మద్రాస్ లో 18 మందికి కరోనా