Rakesh Tikait : భారతీయ కిసాన్ యూనియన్ జాతయ అధికార ప్రతినిధి, రైతు సంఘం అగ్ర నేత రాకేశ్ తికాయత్(Rakesh Tikait) సంచలన కామెంట్స్ చేశారు. ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
అభివృద్ది చెందిన దేశాలలో సైతం అగ్రికల్చర్ సెక్టర్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారని కానీ భారత్ లో ఈరోజు వరకు నిధులు కేటాయించిన పాపాన పోలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రైతు నేత రాకేశ్ తికాయత్ ను లలిత్ పూర్ కు చెందిన మంగళ్ సింగ్ ఆదర్శ రైతు కలిశారు. ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చేలా ఇంధన రహిత మార్స్ టర్బైన్ ను అందించడం ద్వారా దేశం గర్వించేలా చేశారు.
ఈ సందర్బంగా మంగళ్ సింగ్ ను ప్రత్యేకంగా అభినందించారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait). ఇలాంటి ఆవిష్కర్తలు , అన్నదాతలు దేశంలో లెక్కకు మించి ఉన్నారని కానీ వారిని ప్రోత్సహించడంలో కేంద్రం విఫలమైందన్నారు.
మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమై ఉందన్నారు. కానీ ఇదే సమయంలో వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు రాకేశ్ తికాయత్.
ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం గ్రామాల వైపు చూడాలి. పొద్దస్తమానం డిజిటల్ ఇండియా జపం చేయడం వల్ల ఎవరిక న్యాయం జరగడం లేదని తెలుసు కోవాలి.
రైతులు లేకుంటే , వాళ్లు పంటలు పండించక పోతే తిండి గింజలకు కరువు ఏర్పడడం ఖాయమని హెచ్చరించారు.
Also Read : జహంగీర్ పూరి ఘటనపై ఆస్థానా ఆరా