Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి డిజిటల్ చెల్లింపుల ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు.
చిన్న చిన్న ఆన్ లైన్ చెల్లింపులు భారీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు దోహదం చేస్తాయని చెప్పారు. తన నెల వారీ మన్ కీ బాత్ రేడియో ప్రసారంలో డిజిటల్ చెల్లింపులు, స్టార్టప్ (అంకురాలు) పర్యావరణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా అనుభవం ఉన్న వారు ఇతరులతో పంచు కోవాలని సూచించారు ప్రధాన మంత్రి.
ఇదిలా ఉండగా దేశంలో ఇప్పుడు రూ. 20,000 వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడిచారు. ఇది సౌకర్యాలను పెంచడమే కాకుండా నిజాయతీతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నదని ప్రధాని అన్నారు.
అనేక కొత్త ఫిన్ టెక్ స్టార్టప్ లు రాబోతుఉన్నాయని తెలిపారు. మీ అనుభవాలు దేశంలోని ఇతరులకు స్పూర్తి దాయకంగా నిలుస్తాయని చెప్పారు ప్రధాన మంత్రి మోదీ. దేశంలో రోజుకు రూ. 20 వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు.
మార్చిలో యూపీఐ లావాదేవీలు రూ. 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు మోదీ. అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించిన ప్రధాన మంత్రి సంగ్రహాలయ గురించి దేశ వ్యాప్తంగా ప్రజలు తనకు లేఖలు రాశారని, సందేశాలు పంపించారని అన్నారు.
ప్రధాన మంత్రుల మ్యూజియంను సందర్శించాలని మోదీ(Modi )కోరారు. మ్యూజియం మెమోరీస్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి వారు తమ అనుభవాలను పంచు కోవాలని సూచించారు ప్రధాని. దివ్యాంగులు కళలు, విద్యా వేత్తలు, అనేక రంగాలలో అద్భుతాలు చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు.
Also Read : రెండేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ కు మోదీ